హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఐసీసీ అడుగులు వేస్తోంది. ఇందులో బాగంగా టెస్టు, వన్డే ఫార్మాట్లలో లీగ్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ప్రపంచ టీ20 కోసం ఫుట్‌బాల్ తరహాలో రీజినల్ క్వాలిఫయింగ్ టోర్నీలు నిర్వహించాలని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) ప్రతిపాదించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ: ఏం జరుగుద్దో, ఫ్యాన్స్‌తో కోహ్లీసేనకు బోర్డు షాక్?
ఐసీసీ బోర్డు నుంచి ఆమోదం లభిస్తే 2019 నుంచి కొత్త లీగ్‌లు ప్రారంభం అవుతాయన్నమాట. నిజానికి శుక్రవారం జరిగిన బోర్టు సమావేశంలో సీఈసీ చేసిన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలపాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అలా జరగలేదు. దీంతో వీటిపై ఏప్రిల్‌లో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

సీఈసీ ప్రతిపాదనలకు ఐసీసీ బోర్డు నుంచి ఆమోదం లభిస్తే రెండేళ్ల వ్యవధిలో మొత్తం 12 జట్లు టు-టైర్ లీగ్‌లో పోటీపడతాయి. జింబాబ్వే, ఆప్ఘనిస్థాన్ మినహా టెస్టు హోదా గల తొమ్మిది జట్లు ఒక గ్రూప్‌లో పోటీ పడతాయి. ఈ తొమ్మిది జట్లు రెండేళ్ల కాలంలో మిగతా జట్లతో స్వదేశంతో పాటు బయటా సిరీస్‌లు ఆడతాయి.
ఏదైనా కారణం చేత సిరిస్ ఆడకపోతే పాయింట్లు కోల్పోతాయి. అయితే ఒక్కో సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లుండాలి, పాయింట్లు ఎలా అన్నది ఇంకా నిర్ణయించలేదు. లీగ్‌తో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సిరీస్‌లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటుని సీఈసీ కల్పించింది. మరోవైపు జింబాబ్వే, ఆప్ఘనిస్థాన్, ఐర్లాండ్‌లు అసోసియేట్ దేశాలతో కలిసి మ్యాచ్‌లు ఆడుతాయి.

లీగ్ ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేఆఫ్ మ్యాచ్ నిర్వహించి విజేతను ఐసీసీస ప్రకటిస్తుంది. ఇక వన్డేల విషయానికి వస్తే 13 జట్ల మధ్య మూడేళ్ల వ్యవధిలో వన్డే లీగ్ జరుగుతుంది. ప్రతి జట్టు కూడా స్వదేశంతో పాటు బయట కూడా సిరిస్ ఆడాల్సి ఉంటుంది. పది టెస్టు హోదా జట్లతో పాటు అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ లాంటి దేశాలు ప్రపంచ క్రికెట్ లీగ్ విజేత ఈ వన్డే లీగ్ బరిలో నిలుస్తుంది.
లీగ్ ముగిసే నాటికి తొలి ఏడు స్ధానాల్లో ఉన్న జట్లుతో పాటు ఆతిథ్య జట్టు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది. ఇక మిగిలిన ఐదు జట్లు మరికొన్ని అసోసియేట్ దేశాలతో కలిసి వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఆడతాయి. ఇక వరల్డ్ టీ20 విషయానికి వస్తే రీజినల్ క్వాలిఫయింగ్ టీ20 టోర్నీలను నిర్వహించాలని సీఈసీ ప్రతిపాదించింది.