ICC Player Of The Month July: జానీ, జయసూర్య, గుస్తావ్ నామినేటెడ్.. మన భారత మహిళ ప్లేయర్ కూడా.. ఓటేయండే..!

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జులై నెల ఐసీసీ మెన్స్ మరియు వుమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కోసం నామినీలను ప్రకటించింది. ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, ఫ్రాన్స్ ప్లేయర్ గుస్తావ్ మెక్‌కీన్ మెన్స్ విభాగంలో నామినీలుగా ఎంపికయ్యారు. వీరిలో ఒకరు జులై ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలుస్తారు. రిజల్ట్ 8వ తారీఖున తెలుస్తాయి. క్రికెట్ అభిమానులు ఎవరైనా ఓటు వేసి వీరిలో ఒకరిని గెలిపించొచ్చు. ఎక్కువ ఓట్లు పడ్డ వాళ్లకు ప్రేక్షకుల కోటా కింద విన్నింగ్ పర్సంటేజీ పెరుగుతుంది. మన ఇండియన్ రేణుక సింగ్‌ను గెలిపించడానికి మీరు ఐసీసీ సైట్లో రిజిస్టర్ చేసుకుని ఓటు వేయండి. ఇకపోతే జూన్ నెల మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచిన సంగతి తెలిసిందే. అతను తన అప్రతిహత బ్యాటింగ్‌ను కొనసాగించడంతో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. జులైలో భారత్‌తో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్‌లో కూడా రెండు ఇన్నింగ్స్‌లలో దూకుడుగా ఆడాడు. తద్వారా భారత్‌ను ఓడించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన ప్లేయర్
అతను తొలుత 106పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను గట్టెక్కించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 114* పరుగులతో కడవరకు జో రూట్‌తో కలిసి ఒక అద్భుతమైన స్టాండ్ అందించాడు. తద్వారా ఇంగ్లాండ్ 378పరుగులను ఛేదించింది. తర్వాత అతను దక్షిణాఫ్రికాపై మొదటి వన్డేలో 63పరుగులు, మొదటి T20I 53 బంతుల్లో 90పరుగులు చేసి మ్యాచ్ గెలుపునకు కీలక కారణమయ్యాడు.

మూడు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు 5వికెట్ల హాల్ సాధించిన ప్లేయర్
ఇకపోతే శ్రీలంక సరికొత్త స్పిన్ సంచలనం ప్రభాత్ జయసూర్య కూడా మంత్ ఆఫ్ ది ప్లేయర్ నామినీ లిస్టులో నిలిచాడు. గాలేలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ను శ్రీలంక సమం చేయడంతో స్పిన్నర్ 6/118, 6/59 ప్రదర్శనలతో సత్తా చాటాడు. అతను పాకిస్థాన్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో 5/82, 4/135తో రాణించాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 3/80, రెండో ఇన్నింగ్స్‌లో 5/117 తీసుకున్న తర్వాత జయసూర్య తన నాలుగో ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. మూడు టెస్టుల్లోనే నాలుగుసార్లు 5వికెట్ల హాల్ సాధించి అద్భుతం చేశాడు.

టీ20ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన ప్లేయర్
గుస్తావ్ మెక్‌కీన్ ఒక యువ ఫ్రెంచ్ బ్యాటర్. అతను కూడా మూడో నామినీగా ఎంపికయ్యాడు. 18 ఏళ్ల గుస్తావ్ మెక్ కీన్.. చెక్ రిపబ్లిక్‌తో తన అరంగేట్రం మ్యాచ్‌లో 54బంతుల్లో 76పరుగులు చేశాడు. అయితే అతను T20 చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు (స్విట్జర్లాండ్‌పై (109), నార్వేపై (101) ) కొట్టిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. అతను మెన్స్ టీ20ల్లో తొలి మూడు మ్యాచులలో 286పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.

మహిళల్లో మన భారత ప్లేయర్
ఇక వుమెన్స్ లిస్టులో ఇంగ్లాండ్‌కు చెందిన ఎమ్మా లాంబ్, నాట్ స్కివెర్, ఇండియాకు రేణుకా సింగ్ ఠాకూర్ మంత్ ఆఫ్ ది ప్లేయర్‌కు నామినేట్ అయ్యారు. రేణుకా సింగ్ ఠాకూర్ జులైలో ఐదు మ్యాచ్‌ల్లో 12వికెట్లు పడగొట్టింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆమె మొదటి గేమ్‌లో 3/29తో సహా 7వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత రెండో వన్డేలో 4/28తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా పొందింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభ మ్యాచ్‌లోనూ ఆమె 4/18తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications