
భారత ఆటగాళ్లకు దక్కని చోటు:
అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత ఆటగాడికి చోటు దక్కలేదు. వాస్తవానికి మనోళ్ల ప్రదర్శన చెప్పుకునే రీతిలో లేకపోవడమే ఇందుకు కారణం అని చెప్పొచ్చు. రోహిత్ శర్మ, కేఎల్ రాహల్, విరాట్ కోహ్లీల మెరుపులు 1-2 మ్యాచులకే పరిమితం అయ్యాయి. మరోవైపు రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ నుంచి కూడా ఒక్క ఆటగాడికి చోటు దక్కకపోవడం గమనార్హం. ఇక టాప్ 8 జట్ల నుంచి కనీసం ఒక్కో ప్లేయర్ ఐసీసీ జట్టులో చోటు దక్కించుకున్నారు. టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా నుంచి ఏకంగా ముగ్గురు ప్లేయర్స్ ఐసీసీ జట్టులో చోటు సంపాదించారు.
|
ఓపెనర్లుగా వార్నర్, బట్లర్:
ఐసీసీ తమ జట్టుకు ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్‌లను ఎంపిక చేసింది. టాప్ ఆర్డర్లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ఎప్పుడూ ఆల్ టైం పర్ఫెక్ట్ అని పేర్కొంది. మెగా టోర్నీలో వార్నర్ 48.16 సగటుతో 289 పరుగులు చేసి.. 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. బట్లర్ 89.66 సగటుతో 269 పరుగులు చేశాడు. బాబర్ ఆజామ్, చరిత్ అసలంక, ఐడెన్ మార్క్రమ్లను ఐసీసీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా ఎంచుకుంది. బాబర్ 60.60 సగటుతో 303 పరుగులు చేశాడు. శ్రీలంక ప్లేయర్ చరిత్ అసలంక 46.20 సగటుతో 231 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడాన్ మార్క్రామ్ 54 సగటుతో 162 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్న మొయిన్ అలీ (131. 42 స్ట్రైక్ రేట్‌తో 92 పరుగులు, 11 సగటుతో 7 వికెట్లు) అద్భుతంగా రాణించాడు.

ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు:
జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, అన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగా, ఆడమ్ జంపాలను ఐసీసీ బౌలర్లుగా ఎంపిక చేసింది. శ్రీలంక ఆటగాడు హసరంగ 16 వికెట్లతో టోర్నీలో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ స్పిన్నర్ జంపా 13 వికెట్లు, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్ 11 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ ఆటగాడు బౌల్ట్ 13 వికెట్లు తీయగా.. దక్షిణాఫ్రికా ప్లేయర్ నోర్జ్ 9 వికెట్లు పడగొట్టాడు. ఇక 12వ ప్లేయర్‌గా పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని ఐసీసీ ఎంపిక చేసింది.
|
ఐసీసీ ఎంపిక చేసిన జట్టు ఇదే:
డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్, బాబర్ ఆజామ్, చరిత్ అసలంక, ఐడెన్ మార్క్రమ్, మొయిన్ అలీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, అన్రిచ్ నోర్జ్, వనిందు హసరంగా, ఆడమ్ జంపా, షాహీన్ అఫ్రిది (12వ ఆటగాడు).