పాయింట్లు పాయే.. పరువు పాయే: ఐసీసీ చర్యతో పాక్ విలవిల!
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. మైదానంలో ఎదురైన ఓటమికి తోడు ఇప్పుడు ఐసీసీ విధించిన జరిమానా ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. మీర్‌పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్టులో ఓడిపోవడమే కాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికను ఒక్కసారిగా తలకిందులు చేసింది.
మీర్‌పూర్ టెస్టులో చారిత్రక ఓటమి
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ జట్టుకు మీర్‌పూర్ టెస్టులో ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్థాన్ 104 పరుగుల తేడాతో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తన సొంత గడ్డపై పాకిస్థాన్‌ను ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఇదే తొలిసారి. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. పాకిస్థాన్ తీవ్ర విమర్శల పాలవుతోంది. బంగ్లా బౌలర్ నహిద్ రాణా 5 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.

ఐసీసీ కఠిన చర్యలు
టెస్టు ఓటమి బాధలో ఉన్న పాకిస్థాన్‌కు ఐసీసీ స్లో ఓవర్ రేట్ రూపంలో మరో షాకిచ్చింది. నిర్ణీత సమయంలో పాక్ జట్టు 8 ఓవర్లు తక్కువగా వేసినట్లు అంపైర్లు గుర్తించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రతి ఓవర్ ఆలస్యానికి మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధిస్తారు. దీంతో పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించారు. ఇంతటితో ఆగకుండా ఒక్కో ఓవర్ ఆలస్యానికి ఒక్కో పాయింట్ చొప్పున 8 డబ్ల్యూటీసీ పాయింట్లను ఐసీసీ కోత విధించింది.
డబ్ల్యూటీసీ పట్టికలో తలకిందులైన సమీకరణాలు
ఐసీసీ విధించిన ఈ శిక్ష పాకిస్థాన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం పాక్ ఖాతాలో కేవలం 4 పాయింట్లు మాత్రమే మిగిలాయి. దీనివల్ల పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 7వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఈ జట్టు కేవలం ఇంగ్లాండ్, వెస్టిండీస్ కంటే మాత్రమే పైన ఉంది. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా వంటి జట్లు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. పాక్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలవడమే కాకుండా, ఓవర్ రేట్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
నిర్ణయాన్ని అంగీకరించిన కెప్టెన్ షాన్ మసూద్
పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ ఐసీసీ మోపిన అభియోగాలను అంగీకరించాడు. దీనిపై ఎటువంటి అప్పీలుకు వెళ్లడం లేదని స్పష్టం చేయడంతో, ఐసీసీ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో ఎటువంటి విచారణ లేకుండానే శిక్షను ఖరారు చేశారు. ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, కుమార ధర్మసేనలు పాక్ జట్టు స్లో ఓవర్ రేట్‌పై ఫిర్యాదు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications