Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రచిన్ రవీంద్ర గాయానికి అసలు కారణమిదే.. పీసీబీని దారుణంగా తిడుతోన్న ఫ్యాన్స్

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతి నేరుగా తగిలి న్యూజిలాండ్ యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రకు తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ ఘటన తీవ్ర విమర్శలకు దారీ తీస్తోంది. ఫలితంగా ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డును క్రికెట్ అభిమానులు ఏకీపారేస్తున్నారు. పైగా త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఈ మైదానం (గడాఫీ) వేదికగానే జరగాల్సి ఉండడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ తెగ మండిపడుతున్నారు.

తీవ్ర విమర్శలు
'ఐసీసీ ఇలాంటి మైదానానికి ఎలా ఓకే చెప్పిందో అస్సలు అర్థం కావడం లేదు', 'ఆటగాళ్ల భద్రతకు ఐసీసీ కట్టుబడి ఉండాలి', 'చెత్త లైటింగ్ వల్ల ఇలా జరిగింది', 'త్వరగా లైటింగ్ పరిస్థితిని మెరుగుపరచండి', 'గడాఫీ స్టేడియంలో నాసిరకమైన ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు', 'సరైన సదుపాయాలను ఏర్పాటు చేయలేకపోతే ట్రోఫీని దుబాయ్ కు మార్చండి', 'ఐసీసీ నిర్దేశించిన గడువు లోగా మైదానం రెనోవేషన్ పూర్తి చేయాలనే త్వరలో నాసిరకరమైన పనులు చేపట్టింది పాక్ బోర్డు' అంటూ తీవ్ర స్థాయిలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ICC PCB Criticized for Poor Stadium lights After Rachin Ravindra s Injury at Gaddafi Stadium

రచిన్ గాయానికి అదే కారణమా
రచిన్‌ బౌండరీ లైన్‌ దగ్గర క్యాచ్‌ కు ప్రయత్నించి గాయపడ్డాడు. బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడం ఈ గాయమైంది. బంతి అతడి నుదుటికి నేరుగా తాకింది. అయితే దీనికి కారణం ఫ్లడ్‌లైట్ల వెలుతురు సరిగ్గా లేకపోవడమే అని అంటున్నారు. పైగా ఈ మ్యాచ్‌ లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగింది.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఈ స్టేడియాన్ని రెనోవేషన్ చేసి రెండు రోజులే అయింది. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల ఐసీసీ, పీసీబీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నాసిరకమైన ఫ్లడ్‌లైట్లను వినియోగించారని పలువురు ఆరోపిస్తున్నారు. వీలైనంత త్వరగా మిగతా స్టేడియాల్లోనూ ఏర్పాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి.

Story first published: Sunday, February 9, 2025, 13:49 [IST]
Other articles published on Feb 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+