
హరారేలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో జింబాబ్వేపై 3-0 తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విజయం తర్వాత భారత్ వన్డే ర్యాంకింగ్ పుంజుకుంది. 111 రేటింగ్ పాయింట్లతో పాటు ఓవరాల్‌గా మూడో స్థానానికి ఎగబాకింది. అక్టోబరులో దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. భారత్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపరుచుకోవడానికి దక్షిణాఫ్రికా సిరీస్ మరో అవకాశమనే చెప్పాలి. ఇక పాకిస్తాన్ కూడా వారి ర్యాంకింగ్‌లో కాస్త మెరుగైంది. ఆ జట్టు 107రేటింగ్ పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం భారత్ తర్వాత నాలుగో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్‌పై పాక్ 3-0తేడాతో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినందున ఆ జట్టు రేటింగ్ పెరిగింది.
ఇక పాక్‌ను నెదర్లాండ్స్ రెండు మ్యాచ్‌ల్లో వణికించింది. మొదటి మ్యాచ్‌లో కేవలం 16పరుగుల స్వల్ప తేడాతో నెదర్లాండ్స్ పరాజయం పాలయింది. అలాగే చివరి వన్డేలో కూడా కేవలం తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో వన్డేలో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ ఏడాది అక్టోబరు-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్‌కు వన్డే సిరీస్లు లేవు. దీంతో ఆ జట్టు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకోవడానికి పెద్ద అవకాశాలు లేవనే చెప్పాలి.
వెస్టిండీస్‌పై 2-1తో వన్డే సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ 124పాయింట్లతో తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ 119పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్ ఇంగ్లాండ్ ఆడుతుంది. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు 0-1 తేడాతో వెనకంజలో ఉంది. ఇకపోతే కివీస్ వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ కంటే 9 రేటింగ్ పాయింట్లు మెరుగ్గా ఉండేది. వెస్టిండీస్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో ఓడడంతో ఆ జట్టు నాలుగు పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఐదు పాయింట్ల తేడాతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇకపోతే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్ వచ్చే నెల ప్రారంభంలో జరగనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్ ఓడిపోతే న్యూజిలాండ్ ర్యాంకు దిగజారుతుంది. గెలిస్తే మరింత స్థిరపడుతుంది. ఆస్ట్రేలియా సిరీస్ గెలిస్తే 101 పాయింట్లతో ఐదవ ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియా పాక్‌ను దాటేసి నాలుగో స్థానానికి చేరుకునే వీలుంది.