Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌తో ముగించిన కోహ్లీ!!

ICC ODI Rankings: Virat Kohli, Rohit Sharma end 2019 as No.1 and No.2 ranked batsmen

దుబాయ్: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తరువాత అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, వైస్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మలు టాప్‌లో నిలిచారు. కోహ్లీ 887 రేటింగ్‌ పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకులో నిలవగా.. రోహిత్‌ 873 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల టెస్టుల్లోను కోహ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 2019ని అగ్రస్థానంతో ముగించాడు.

టాప్‌లో కోహ్లీ:

టాప్‌లో కోహ్లీ:

విండీస్‌తో సిరీస్‌లోనే కాకుండా.. రోహిత్, కోహ్లీలు ఈ ఏడాది పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. కోహ్లీ 26 వన్డేల్లో 1,377 పరుగులు చేయగా.. రోహిత్‌ 28 వన్డేల్లో 1,490 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీ కంటే రోహిత్ ఎక్కువ పరుగులు చేసినప్పటికి ర్యాంకింగ్స్‌లో వెనకే ఉండడం విశేషం. కోహ్లీ మూడు ఫార్మాట్లలో ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు (2,445 ) చేయగా.. రోహిత్ (2,442) పోటీ పడ్డాడు.

17 స్థానాలు ఎకబాకిన రాహుల్:

17 స్థానాలు ఎకబాకిన రాహుల్:

ఐసీసీ బ్యాట్స్‌మెన్ల జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు బాబర్‌ అజాం (834 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు. విండీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన కేఎల్ రాహుల్‌ 17 స్థానాలు ఎకబాకి 71కి చేరుకోగా.. శ్రేయాస్ అయ్యార్‌ 104 ర్యాంక్‌ నుంచి 81వ స్థానానికి దూసుకొచ్చాడు. విండీస్‌ ఆటగాడు షాయ్‌ హోప్‌ తొమ్మిదో ర్యాంకుకు చేరాడు. హెట్‌మయెర్‌ (19), పూరన్‌ (30), కాట్రెల్‌ (30) తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.

బుమ్రా@1

బుమ్రా@1

గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరంగా ఉన్నా బౌలింగ్ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. ట్రెంట్ బోల్ట్, ముజీబ్ రహ్మాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్‌ల జాబితాలో బెన్ స్టోక్స్ మొదటి స్థానంలో ఉండగా.. టాప్-10లో ఒక్క భారత ఆటగాడు కూడా లేడు. జట్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ (125) టాప్‌లో ఉండగా.. భారత్ (123) రెండో స్థానంలో ఉంది.

Story first published: Tuesday, December 24, 2019, 8:45 [IST]
Other articles published on Dec 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+