For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లోనే కోహ్లీ, బుమ్రా

ICC Rankings : Kohli, Bumrah Retain Top Spots In ICC ODI Rankings || Oneindia Telugu
ICC ODI Rankings: Virat Kohli, Jasprit Bumrah retain top spots


దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం వన్డే ర్యాంకులను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, యార్కర్ కింగ్ జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌లో నిలిచారు. 895 రేటింగ్‌ పాయింట్లతో బ్యాటింగ్‌ విభాగంలో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. 797 రేటింగ్‌ పాయింట్లతో బౌలింగ్‌ విభాగంలో బుమ్రా టాప్‌లో ఉన్నాడు. గత ఆగస్టు నుంచి ఒక్క వన్డే ఆడకపోయినప్పటికీ కోహ్లీ, బుమ్రాలు టాప్‌లోనే ఉండడం విశేషం.
 టాప్‌లో కోహ్లీ:

టాప్‌లో కోహ్లీ:

బ్యాటింగ్‌ విభాగంలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఓపెనర్, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ (863) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్, డుప్లెసిస్, రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ వరుసగా ఉన్నారు. కోహ్లీ, రోహిత్ తప్పితే టాప్ -10లో మరో భారత ఆటగాడు లేడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 19వ స్థానానికి పడిపోయాడు.

 పదో స్థానంలో పాండ్యా:

పదో స్థానంలో పాండ్యా:

బౌలింగ్‌లో భారత్‌ నుంచి బుమ్రా మినహా ఎవరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. న్యూజిలాండ్‌ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, కగిసో రబాడ, పాట్ కమ్మిన్స్ టాప్-5లో ఉన్నారు. ఆల్‌రౌండ్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచకప్ హీరో బెన్ స్టోక్స్‌ 319 పాయింట్లతో టాప్ ర్యాంకును సొంతం చేసుకోగా.. రెండో స్థానంలో అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ ఉన్నాడు. ఈ జాబితాలో హార్దిక్‌ పాండ్యా పదో స్థానంలో నిలిచాడు.

 రెండో స్థానంలో భారత్‌:

రెండో స్థానంలో భారత్‌:

జట్టు ర్యాంకింగ్స్‌లో ప్రపంచకప్‌ విజేత ఇంగ్లాండ్‌ (125) అగ్రస్థానంలో ఉంది. భారత్‌ (122) రెండో స్థానంలో కొనసాగుతోంది. టెస్ట్ ఫార్మాట్‌లో మొదటి స్థానంలో ఉన్న భారత్.. టీ20ల్లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా బంగ్లాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య తొలి టెస్టు నవంబర్‌ 14న ప్రారంభం కానుంది. డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో టీమిండియా మూడు టీ-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ డిసెంబర్ 6న ప్రారంభం అవుతుంది.

 88 స్థానాలను ఎగబాకాడు:

88 స్థానాలను ఎగబాకాడు:

బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌లో 8 వికెట్లు తీసి 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డు అందుకున్న టీమిండియా పేసర్‌ దీపక్‌ చహర్‌ తన టీ20 ర్యాంక్‌ను మరింత మెరుగుపరుచుకున్నాడు. సోమవారం విడుదల చేసిన బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో చహర్‌ 42వ స్థానంలో నిలిచాడు. చివరి టీ20లో హ్యాట్రిక్‌తో సహా 6 వికెట్లు పడగొట్టడంతో చహర్‌ ఒకేసారి 88 స్థానాలను ఎగబాకాడు. ఇది చహర్‌కు అత్యుత్తమ టీ20 రాంక్.

ఏడో స్థానాన్ని కాపాడుకున్న రోహిత్‌:

ఏడో స్థానాన్ని కాపాడుకున్న రోహిత్‌:

బ్యాట్స్‌మెన్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఏడో స్థానాన్ని కాపాడుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో తృటిలో సెంచరీని మిస్సైన రోహిత్ శర్మ ఈ సిరిస్‌లో మొత్తం 96 పరుగులు చేశాడు. ఫలితంగా టీ20ల్లో తన ర్యాంకుని మరింతగా మెరుగుపరుచుకున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ టెస్టుల్లో 10వ ర్యాంకులో, వన్డేల్లో రెండో ర్యాంకులో, టీ20ల్లో 7వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Story first published: Tuesday, November 12, 2019, 20:21 [IST]
Other articles published on Nov 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+