ICC ODI Rankings: కెరీర్ బెస్ట్ ర్యాంకుకు కేదార్ జాదవ్


హైదరాబాద్: ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ అగ్రస్థానాలను కాపాడుకున్నారు. బ్యాటింగ్‌లో కోహ్లీ, బౌలింగ్‌లో బుమ్రాలు టాప్‌లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ తాజాగా ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 890 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా.. 839 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.

890 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో
ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌లో కోహ్లీ 310 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 202 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ 830 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో 353 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన క్వింటన్ డికాక్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

11 స్థానాలను మెరుగుపర్చుకుని 24వ స్థానానికి కేదార్ జాదవ్
ఇంగ్లాండ్‌పై రెండు సెంచరీలు సహా 424 పరుగులు చేసిన విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ 35 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌కి చేరుకున్నాడు. భారత్‌పై రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కెరీర్లోనే బెస్ట్‌గా 25వ స్థానానికి చేరుకున్నాడు. కేదార్ జాదవ్ 11 స్థానాలను మెరుగుపర్చుకుని 24వ స్థానానికి చేరుకోగా.. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ 29వ స్థానానికి చేరుకున్నాడు.

774 పాయింట్లతో అగ్ర స్థానంలో బుమ్రా
ఇక, బౌలర్ల విషయానికి వస్తే బూమ్రా 774 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రశీద్‌కాన్ మూడో స్థానానికి పడిపోయాడు. బంగ్లాదేశ్‌తో ముగిసిన సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో నిలిచాడు.

ఆల్ రౌండర్ల జాబితాలో రషీద్‌ఖాన్
ఆల్ రౌండర్ల జాబితాలో రషీద్‌ఖాన్ మొదటి స్థానంలో ఉండగా భారత ఆటగాడు కేదార్ జాదవ్ 14వ స్థానానికి చేరుకున్నాడు. జట్ల ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. ఇంగ్లాండ్ 123 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా (120 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. 112 పాయింట్లతో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications