న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐఐసీసీ ర్యాంకింగ్స్‌: టాప్‌లోనే కోహ్లీ, బుమ్రా.. కెరీర్ బెస్ట్‌కు అమిర్

ICC ODI Rankings: Virat Kohli, Jasprit Bumrah maintain top spot

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత బౌలింగ్ సంచలనం జఫ్రీత్ బుమ్రాలు తమ టాప్‌ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబ‌ర్‌వ‌న్ బ్యాట్స్‌మెన్‌గా విరాట్.. నెంబ‌ర్‌వ‌న్ బౌలర్‌గా బుమ్రా నిలిచారు. ఇటీవలే టెస్ట్ ఫార్మాట్ నుండి రిటైర్ అయిన పాకిస్థాన్ స్టార్ పేసర్ మొహ్మద్ అమిర్ కెరీర్ బెస్ట్‌ ర్యాంకుకు చేరుకున్నాడు.

<strong>IND vs SA: టీ బ్రేక్: డికాక్‌ హాఫ్ సెంచరీ.. దక్షిణాఫ్రికా 292/5</strong>IND vs SA: టీ బ్రేక్: డికాక్‌ హాఫ్ సెంచరీ.. దక్షిణాఫ్రికా 292/5

ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా 797 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బోల్ట్ 740 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కాగిసో రబాడ (694), పాట్ కమిన్స్ (693), ముజీబ్ ఉర్ రెహమాన్ (681) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన మూడు వన్డే మ్యాచ్‌ల శ్రీలంక సిరీస్‌లో అమిర్ 4 వికెట్లు తీయడంతో.. ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్ బెస్ట్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. 663 రేటింగ్ పాయింట్లతో ఏడవ ర్యాంకులో ఉన్నాడు. పాకిస్థాన్‌కు చెందిన మరో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉస్మాన్ షిన్వారీ కూడా 28 స్థానాలు మెరుగుపరుచుకుని 43వ స్థానానికి చేరుకున్నాడు.

ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో 895 పాయింట్లతో కోహ్లీ నంబర్ వన్‌గా నిలవగా.. 863 పాయింట్లతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజామ్ 827 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. డుప్లెసిస్ (820), రాస్ టేలర్ (817) టాస్-5లో ఉన్నారు. పాకిస్తాన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ 16, హరిస్ సోహైల్ 32వ స్థానంలో ఉండగా.. శ్రీలంకకు చెందిన దనుష్క గుణతిలక కెరీర్‌లో అత్యుత్తమ రాంక్( 70) స్థానానికి చేరుకున్నాడు.

వన్డే టీం ర్యాంకింగ్స్‌లో 125 పాయింట్లతో ఇంగ్లండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ (122), న్యూజీలాండ్ (112), ఆస్ట్రేలియా (11), దక్షిణిణాఫ్రికా (110) వరుసగా ఉన్నాయి. పాకిస్తాన్, శ్రీలంక వరుసగా ఆరో, ఎనిమిదో స్థానాలను నిలుపుకున్నాయి. వన్డే హోదా కలిగిన నమీబియా, ఒమన్ మరియు యుఎస్ఎ ర్యాంకింగ్స్ పట్టికలోకి వచ్చాయి.

Story first published: Friday, October 4, 2019, 16:00 [IST]
Other articles published on Oct 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X