Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కింద పడ్డా పైచేయి పాకిస్తాన్‌దే: అటు బాబర్- ఇటు అఫ్రిది నిజంగా నక్కతోక తొక్కొచ్చారు..!!

ICC ODI rankings 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్న జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి- ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లే. నాసిరకం ఆటతీరును ప్రదర్శిస్తోన్నాయా రెండు జట్లూ. అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోన్నాయి. ఈ రెండూ గతంలో వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచినవే.

పాకిస్తాన్ తన స్థాయి తగ్గట్లుగా ఆడట్లేదనేది స్పష్టమౌతోంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా విఫలమౌతోన్నారు. ఫీల్డింగ్‌లోనూ చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనిపించట్లేదు. షహీన్ షా అఫ్రిది వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా చేతులెత్తేస్తోన్నాడిక్కడ. ఇక ముందు కూడా పాక్ పుంజుకుంటుందనేది అనుమానమే.

ICC ODI rankings: Shaheen Afridi becomes top ODI bowler and Babar Azam stick onhisrank

కేప్టెన్ బాబర్ ఆజమ్ మరీ అధ్వాన్నంగా ఆడుతోన్నాడు. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో బాబర్ ఆజమ్ చేసిన స్కోర్ 216 పరుగులే. బంగ్లాదేశ్‌పై చేసిన 74 పరుగులే అత్యధికం. అది కూడా లేకపోయి ఉంటే అతని స్కోరింగ్ నంబరింగ్, స్టాటిస్టిక్స్ మరింత దిగజారిపోయి ఉండేవి. స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు.

అయినప్పటికీ- అతని అదృష్టం బాగుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లల్లో అగ్రస్థానంలో నిలిచాడు బాబర్ ఆజమ్. 818 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానానికి చేరాడు. అతనిపాయింట్లు 816. వీరిద్దరికీ రెండు పాయింట్లే తేడా. ఈ రెండూ అందుకోగలిగితే టాప్ పొజీషన్‌కు చేరుకుంటాడు గిల.

క్వింటన్ డికాక్- 765 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తరువాతి స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 761 పాయింట్లు ఉన్న డేవిడ్ వార్నర్‌ది నాలుగో స్థానం. టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ అయిదో స్థానానికి ఎగబాకాడు. అతని వద్ద ఉన్న పాయింట్లు 743. ఇదివరకు ఈ స్థానంలో డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ కొనసాగారు.

ICC ODI rankings: Rohit Sharma At 5th position

న్యూజిలాండ్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ ఆరో స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీదీ అదే పరిస్థితి. ఏడో స్థానానికి దిగజారాడు కోహ్లీ. హ్యారీ టెక్టర్- 729, రస్సీ వాన్ డెర్ డుస్సాన్- 706, డేవిడ్ మలన్- 695 పాయింట్లతో టాప్ టెన్‌లో ఉన్నారు.

అటు బౌలింగ్ కేటగిరీలో కూడా పాకిస్తాన్‌దే ఆధిపత్యం. పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షహీన్ షా అఫ్రిది ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచాడు. 673 పాయింట్లతో టాప్ పొజీషన్‌కు చేరుకున్నాడు. ఇదివరకు ఈ స్థానంలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఉండేవాడు. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు.

663 పాయింట్లతో జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో, 656 పాయింట్లతో మహ్మద్ సిరాజ్ మూడో స్థానంలో ఉన్నారు. కెేశవ్ మహరాజ్- 651, ట్రెంట్ బౌల్ట్- 649, రషీద్ ఖాన్- 648, కుల్‌దీప్ యాదవ్- 646, ముజీబ్-ఉర్-రెహ్మాన్ 641, ఆడమ్ జంపా- 637, మహ్మద్ నబీ- 631 పాయింట్లతో తొలి 10 స్థానాల్లో నిలిచారు.

Story first published: Wednesday, November 1, 2023, 14:21 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+