Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వన్డే ర్యాంకులు: కెరీర్ బెస్ట్ సాధించిన తాహిర్, డుప్లెసిస్

హైదరాబాద్: ఐసీసీ శనివారం ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఇమ్రాన్ తాహిర్, ఫా డుప్లెసిస్ వ్యక్తిగత మైలురాళ్లను అందుకున్నారు. శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో వీరిద్దరూ అద్భుతమైన ప్రదర్శన చేశారు.

ఈ సిరిస్‌లో 10 వికెట్లు తీసుకున్న ఇమ్రాన్ తాహిర్ ఐసీసీ వన్డే ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానానికి చేరుకున్నాడు. మరోవైపు డుప్లెసిస్ ఈ సిరిస్‌లో 410 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉంది. దీంతో బ్యాటింగ్ ర్యాంకుల్లో డుప్లెసిస్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు.

వన్డే బౌలింగ్‌లో ఇమ్రాన్ తాహిర్ నెంబర్ వన్

వన్డే బౌలింగ్‌లో ఇమ్రాన్ తాహిర్ నెంబర్ వన్

టీ20ల్లో ఇప్పటికే నెంబర్ వన్ స్ధానంలో ఉన్న ఇమ్రాన్ తాహిర్ శ్రీలంకతో సిరిస్ ప్రారంభం కాక ముందు 712 పాయింట్లతో మూడో స్ధానంలో ఉన్నాడు. ఈ సిరిస్‌లో పది వికెట్లు తీసుకుని 49 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ బౌలర్ ట్రెండ్ బౌల్ట్, వెస్టిండిస్ బౌలర్ సునీల్ నరేన్‌ను వెనక్కు నెట్టి వన్డేల్లో కూడా తాహిర్ నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు.

నాలుగో స్ధానంలో నిలిచిన డుప్లెసిస్

నాలుగో స్ధానంలో నిలిచిన డుప్లెసిస్

ఇక కెరీర్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్ ఏకంగా ఏడు స్దానాలు ఎకబాకి నాలుగో స్ధానంలో నిలిచాడు. ఈ సిరిస్‌లో డుప్లెసిస్ 67 పాయింట్లు సాధించాడు. దక్షిణాఫ్రికాకు చెందిన డీకాక్ ఐదో స్దానంలో నిలవగా, ఆరో స్ధానంలో హషీమ్ ఆమ్లా నిలిచాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ అగ్రస్ధానంలో ఉండగా, దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్ రెండో స్ధానంలో, టీమిండియా కెప్టెన్ కోహ్లీ మూడో స్ధానంలో నిలిచారు.

సిరిస్ టాప్ బౌలర్‌గా పర్నేల్

సిరిస్ టాప్ బౌలర్‌గా పర్నేల్

శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ పర్నేల్ 11 వికెట్లు తీసుకుని టాప్ బౌలర్‌గా నిలిచాడు. తద్వారా బౌలింగ్ రాంకుల్లో 16 స్థానాలు ఎగబాకి 28వ స్ధానంలో నిలిచాడు. ఈ సిరిస్‌లో 8 వికెట్లు తీసుకున్న మొర్రిస్ 70 స్ధానాలు ఎగబాకి 51వ స్ధానంలో నిలిచాడు.

వన్డే ఆల్ రౌండర్‌గా షకిబ్ ఉల్ హాసన్

వన్డే ఆల్ రౌండర్‌గా షకిబ్ ఉల్ హాసన్

ఇక వన్డే ఆల్ రౌండర్ల విషయానికి వస్తే బంగ్లాదేశ్‌కు చెందిన షకిబ్ ఉల్ హాసన్ ఆగ్రస్దానంలో కొనసాగుతుండగా, అతని తర్వాత రెండో స్ధానంలో ఆప్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ నాబి ఉన్నాడు. ఇక మూడో స్ధానంలో శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఉన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+