హైదరాబాద్: న్యూజిలాండ్ సిరిస్ ముగిసిన అనంతరం ఐసీసీ తాజాగా శుక్రవారం విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన నెంబర్ వన్ స్ధానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ సిరిస్‌లో డివిలియర్స్ మొత్తం 262 పరుగులు చేశాడు.
వెల్లింగ్టన్‌లో జరిగిన మూడో వన్డేలో డివిలియర్స్ ఈ సిరిస్లో అత్యధిక స్కోరు 85 పరుగులు నమోదు చేయడంతో 875 పాయింట్లతో అగ్రస్ధానానికి చేరాడు. మే 2010లో తొలిసారి వన్డే ర్యాంకుల్లో అగ్రస్ధానంలో నిలిచిన ఏబీ డివిలియర్స్ ఇప్పటివరకు పదిసార్లు ఆ స్ధానానికి చేరుకున్నాడు.
ఇక 871 పాయింట్లతో రెండో స్ధానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కొనసాగుతున్నాడు. 852 పాయింట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. డేవిడ్ వార్నర్‌కు విరాట్ కోహ్లీకి 23 పాయింట్ల వ్యత్యాసం ఉంది. వెస్టిండిస్‌పై ఇంగ్లాండ్ జట్టు 3-0తో సిరిస్‌ను కైవసం చేసుకుంది.

మూడో వన్డేలో కరేబియన్లపై అద్ఫుత సెంచరీలు సాధించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, అలెక్స్ హాల్స్ తమ తమ స్ధానాలను మెరుగుపరచుకున్నారు. వెస్టిండిస్ సిరిస్‌లో జో రూట్ మొత్తం 195 పరుగులు చేశాడు. బ్రిడ్జిటౌన్‌లో జరిగిన చివరి వన్డేలో జో రూట్ 101, అలెక్స్ హాల్స్ 110 పరుగులతో రాణించారు.
దీంతో 787 రేటింగ్ పాయింట్లతో జో రూట్ నాలుగో స్ధానంలో నిలిచాడు. ఇక అలెక్స్ హాల్స్ నాలుగు స్ధానాలు ఎగబాకి 16వ స్ధానంలో నిలిచాడు. ఇక కివీస్ ఆటగాళ్లు మార్టిన్ గుప్తిల్ రెండు స్ధానాలు ఎగబాకి ఏడో స్ధానంలో నిలవగా, రాస్ టేలర్ రెండు స్ధానాలు ఎగబాకి 14వ స్ధానంలో నిలిచాడు.
వన్డే ర్యాంకులు: టాప్ టెన్ బ్యాట్స్‌మెన్
(Read as Rank (+/-), Player, Team, Points)
1. (+1) ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా 875
2. (-1) డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా 871
3. ( - ) విరాట్ కోహ్లీ ఇండియా 852
4. (+4) జో రూట్ ఇంగ్లాండ్ 787
5. (-1) ఫా డుఫ్లెసిస్ దక్షిణాఫ్రికా 781
6. (-1) డికాక్ దక్షిణాఫ్రికా 780
7. (+2) మార్టిన్ గుప్తిల్ న్యూజిలాండ్ 777
8. (-2) కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ 758
9 (+1) బాబర్ అజాం పాకిస్థాన్ 733
10. (+1) స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా 733