అదృష్టం అంటే నీదేరా ఆజామూ..!!
ICC ODI rankings 2023: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్న జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి- ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లే. నాసిరకం ఆటతీరును ప్రదర్శిస్తోన్నాయా రెండు జట్లూ. అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోన్నాయి. ఈ రెండూ గతంలో వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచినవే.
వాటికంటే చిన్న జట్లయిన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ అదరగొడుతున్నాయి. తమ స్థాయికి మించి ఆడుతున్నాయి. ఒకే టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లను ఓడించిన ఘనతను సొంతం చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్. టైటిల్ రేసులో దూసుకెళ్తోన్న దక్షిణాఫ్రికా స్పీడ్‌కు బ్రేకులు వేసింది నెదర్లాండ్స్.

పాకిస్తాన్ తన స్థాయి తగ్గట్లుగా ఆడట్లేదనేది స్పష్టమౌతోంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా విఫలమౌతోన్నారు. ఫీల్డింగ్‌లోనూ చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనిపించట్లేదు. షహీన్ షా అఫ్రిది వంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కూడా చేతులెత్తేస్తోన్నాడిక్కడ. ఇక ముందు కూడా పాక్ పుంజుకుంటుందనేది అనుమానమే.
కేప్టెన్ బాబర్ ఆజమ్ మరీ అధ్వాన్నంగా ఆడుతోన్నాడు. ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో బాబర్ ఆజమ్ చేసిన స్కోర్ 157 పరుగులే. బంగ్లాదేశ్‌పై చేసిన 74 పరుగులే అత్యధికం. అది కూడా లేకపోయి ఉంటే అతని స్కోరింగ్ నంబరింగ్, స్టాటిస్టిక్స్ మరింత దిగజారిపోయి ఉండేవి. స్ట్రైక్ రేట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండట్లేదు. 79.69 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు.

అయినప్పటికీ- అతని అదృష్టం బాగుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లల్లో అగ్రస్థానంలో నిలిచాడు బాబర్ ఆజమ్. 829 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానానికి చేరాడు. అతనిపాయింట్లు 823. వీరిద్దరికీ పాయింట్లల్లో పెద్దగా తేడా లేదు.
క్వింటన్ డికాక్- 769 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. ఆ తరువాతి స్థానంలో హెన్రిక్ క్లాసెన్ ఉన్నాడు. 756 పాయింట్లు ఉన్న క్లాసెన్‌ది నాలుగో స్థానం. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ అయిదు, ఆరు స్థానాల్లో నిలిచారు. వారివద్ద ఉన్న పాయింట్లు 747. హ్యారీ టెక్టర్- 729, రోహిత్ శర్మ- 725, రస్సీ వాన్ డెర్ డుస్సాన్- 716, ఇమామ్ ఉల్ హక్- 704 పాయింట్లతో టాప్ టెన్‌లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications