Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యా బాత్ హై సిరాజ్ మియా

ICC ODI rankings 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023.. టీమిండియా విజృంభణకు అద్దం పడుతోంది. సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటివరకు ఓటమి అంటే తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది భారతే. సగం టోర్నమెంట్ అయినపోయినప్పటికీ టీమిండియాను కొట్టే జట్టే లేదు.

ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్.. ఏవీ టీమిండియా ముందు నిలవలేకపోయాయి. చివరికి న్యూజిలాండ్ సైతం భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. ఈ అయిదు విజయాలు- 10 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టు ఇదే అవుతుంది.

ICC ODI bowling rankings 2023: Mohammad SirajmovestoNo2

జట్టు ఇంత శతృ దుర్భేధ్యంగా మారడానికి ప్రధాన కారణం.. ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఎందులోనూ తీసిపోవట్లేదు టీమిండియా. బ్యాటర్లు, బౌలర్లు పోటీ పడి రాణిస్తోన్నారు. బ్యాటర్లు స్టేడియంలో పరుగుల వరద పారిస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు.

ఇదే ఊపుతో తన తదుపరి మ్యాచ్‌కు రెడీ అవుతోంది టీమిండియా. ఈ నెల 29వ తేదీన ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియం దీనికి వేదిక. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో పేస్ బౌలర్ మహ్మద్ షమీని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్స్ ర్యాంకులను కొల్లగొడుతున్నారు టీమిండియా ప్లేయర్లు. అటు బ్యాటింగ్, బౌలింగ్‌లల్లో సత్తా చాటుతోండటం.. కొందరు ప్లేయర్లను ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానానికి చేర్చింది. వన్డే బ్యాటింగ్ విభాగం ర్యాంకుల్లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానానికి చేరాడు. అతనిపాయింట్లు 823. వీరిద్దరికీ పాయింట్లల్లో పెద్దగా తేడా లేదు.

ఇదే కేటగిరీలో ఆరో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ అయిదు, ఆరు స్థానాల్లో నిలిచారు. వారివద్ద ఉన్న పాయింట్లు 747. బౌలింగ్ కేటగిరీలోనూ టీమిండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇక్కడా బౌలర్లు టాప్ 10లో చోటు దక్కించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

హైదరాబాద్‌కు చెందిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. రెండో స్థానంలో నిలిచాడు. అతని వద్ద ఉన్న పాయింట్ల 668. ఈ విషయంలో అతనికి ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కంటే రెండు పాయింట్లు తక్కువగా ఉన్నాయి. 670 పాయింట్లతో జోష్ హేజిల్‌వుడ్.. ఐసీసీ బౌలింగ్ విభాగం ర్యాంకుల్లో టాప్‌లో ఉన్నాడు.

దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్- 656, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్- 654, న్యూజిలాండ్ ట్రెంట్ బౌల్ట్- 653, ఆ దేశానికే చెందిన మహ్మద్ నబీ- 641, ఆసీస్ బౌలర్ ఆడం జంపా- 635, ఇంగ్లాండ్‌కు చెందిన మాట్ హెన్రీ- 634, టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్- 632, పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షహీన్ అఫ్రిది- 625 పాయింట్లతో తొలి 10 జాబితాలో ఉన్నారు.

Story first published: Wednesday, October 25, 2023, 15:28 [IST]
Other articles published on Oct 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+