
హైదరాబాద్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ టెస్టు సిరిస్ ఫిక్సింగ్ అయినట్లు వచ్చిన వార్తలు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పెర్త్ టెస్టు ఫిక్సింగ్‌కు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై ఐసీసీ యాంటీ కరప్షన్ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ స్పందించారు.

'ది సన్ పత్రిక విచారణలో వెల్లడైన అన్ని విషయాలను మా వద్ద ఉన్నాయి. యాషెస్ టెస్టు సిరిస్‌పై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ పని చేస్తోంది' అని ఆయన తెలిపారు. ఆయితే తన ప్రాథమిక దర్యాప్తులో ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏమీ లభించలేదని ఆయన తెలిపారు.

'ప్రస్తుతం విచారణ ఉన్న దశను బట్టి ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఏ ఆటగాడిని కూడా అనుమానించలేదు. ఈ ఫిక్సింగ్ ఆరోపణలు టీ20 టోర్నీలతో పాటు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లపై ప్రభావం చూపుతాయి. మా విచారణలో అన్ని అంశాలను పరిగణనలోకి దీనిపై విచారణ చేస్తున్నాం' అని ఆయన అన్నారు.
ఐదు టెస్టులు యాషెస్ సిరిస్‌లో ఇప్పటివరకు రెండు టెస్టులు పూర్తయ్యాయి. మూడో టెస్టు వాకా వేదికగా గురువారం (డిసెంబర్ 14)న జరగనుంది. ఇప్పటికే ఈ సిరిస్‌లో ఆస్ట్రేలియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు బుకీలు ఫిక్సింగ్‌ను ప్రోత్సహించారని.. అందులో ఒకరు భారత్‌కు చెందిన వ్యక్తి ఉన్నారని ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని ఇవ్వజూపినట్లు సన్ కథనంలో పేర్కొంది.