నిజమేనా: ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ రద్దు చేయనుందా?
హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ రద్దు చేయనుందా? ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే వరల్డ్ టీ20 టోర్నీ కోసం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్ సన్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతన్నిస్తున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఐసీసీ నిర్వహించే రెండు 50 ఓవర్ల టోర్నీల వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే అభిప్రాయాన్ని రిచర్డ్స్ సన్ తన మాటల ద్వారా వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని క్రికెట్ జట్లు టీ20లు ఆడే క్రమంలో ఎక్కువగా వన్డే టోర్నీలు అనవసరమని ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ రద్దు చేయనుందా?
అంతేకాదు నాలుగేళ్ల కొకసారి జరిగే వన్డే వరల్డ్ కప్‌ను మాత్రం యథావిధిగా కొనసాగించేందుకు ఆయన సూచన ప్రాయంగా అంగీకరించారు. 2019లో ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో 10 జట్లు పాల్గొనే సూచనలు ఉన్నాయి. నిజానికి 2021లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ స్ధానంలో రెండు వరల్డ్ టీ20లు
అయితే చాంపియన్స్ ట్రోఫీని రద్దు చేసి ఆ టోర్నీ జరిగే కాలంలో రెండు వరల్డ్ ట్వంటీ 20లను నిర్వహించాలనేది ఆయన మాటల్లో ఉద్దేశంగా కనబడుతోంది. భవిష్యత్తులో 16 నుంచి 20 జట్లు వరకూ క్రికెట్ ఆడే అవకాశం ఉండటం ఒక కారణం కాగా, క్రికెట్ అభిమానుల్లో సైతం వరల్డ్ టీ20 టోర్నీలకు విపరీతమైన క్రేజ్ ఉండటమేనని రిచర్డ్స్ సన్ పేర్కొన్నారు.

ఎక్కువ జట్లకు క్రికెట్ ఆడే అవకాశం
దీంతో పాటు ఎక్కువ జట్లకు క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనేది ఐసీసీ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఐసీసీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం 2021లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకవేళ ఈ టోర్నీని రద్దు చేసినట్లైతే, దాని స్థానంలో వరల్డ్ టీ20 జరిగే అవకాశం ఉంది. తద్వారా రెండేళ్ల కొకసారి వరల్డ్ టీ20లు అభిమానులను కనువిందు చేయనున్నాయి.

ఐసీసీకి ఎక్కువ ఆదాయం కూడా
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు పరిమిత ఓవర్ల క్రికెట్ పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారని రిచర్డ్ సన్ పేర్కొన్నారు. ఎక్కువ జట్లకు అవకాశం కల్పించడంతో ఐసీసీకి ఎక్కువ ఆదాయం కూడా వస్తుందని తెలిపాడు. వరల్డ్ టీ20లో 16 లేదా 20 జట్లతో ఆడే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications