Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC T20I Team of the Year : భారత్ నుంచి నలుగురు.. కెప్టెన్ గా రోహిత్.. కోహ్లీకి మళ్లీ నో ఛాన్స్

టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ మెన్స్ టీ20 టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024 జట్టులో ఎవరు ఉన్నారో ఐసీసీ ప్రకటించింది. ఇందులో ఏకంగా నలుగురు భారత ప్లేయర్లకు చోటు దక్కడం విశేషం. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్య, బుమ్రా, అర్షదీప్ ను ఎంపిక చేసింది. 11 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది.

ఇంకా ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, ఇంగ్లాండ్ నుంచి సాల్ట్, పాకిస్థాన్ నుంచి బాబర్, వెస్టిండీస్ నుంచి పూరన్, జింబాబ్వే నుంచి రజా, అప్ఘానిస్థాన్ నుంచి రషీద్, శ్రీలంక హసరంగ కు ఛాన్స్ దక్కింది. అంతకుముందు వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2024 జట్టులో ఒక్క భారత ప్లేయర్‌కు కూడా చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.

ICC Mens T20I Team of the Year for 2024 Rohit Sharma named captain and no place for Virat Kohli

గణాంకాలు
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 2024లో 11 అంతర్జాతీయ టీ20లు ఆడి 160.16 స్ట్రైక్‌రేటుతో 378 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. తన అద్భుత నాయకత్వ లక్షణాలతో ప్రపంచ కప్‌-2024 ఛాంపియన్‌గా భారత జట్టును నిలిపాడు. టీమిండియా వరల్డ్‌కప్‌ గెలవడంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. గతేడాది 17 మ్యాచ్‌లు ఆడి 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ 18 మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు తీశాడు. ఈ 36 వికెట్లలో 17 వరల్డ్‌కప్‌-2024 టోర్నీలో పడగొట్టినవే. జస్‌ప్రీత్‌ బుమ్రా 8 మ్యాచ్‌లు 15 వికెట్లు తీశాడు. 3/7 అతడి అత్యుత్తమ గణాంకాలు.

ట్రవిస్‌ హెడ్‌ 15 టీ20లలో 539 పరుగులు చేయగా.. ఫిల్‌ సాల్ట్‌ 17 మ్యాచ్‌లు ఆడి 467 పరుగులు సాధించాడు. బాబర్‌ ఆజం 24 మ్యాచ్‌ల్లో 734 రన్స్, నికోలస్‌ పూరన్‌ 21 మ్యాచ్‌ల్లో 464 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. సికిందర్‌ రజా 24 మ్యాచ్‌ల్లో 573 పరుగులు నమోదు చేశాడు. రషీద్‌ ఖాన్‌ 14 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 4/14 గణాంకాలు నమోదు చేశాడు. వనిందు హసరంగ 20 మ్యాచుల్లో 179 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, January 25, 2025, 15:21 [IST]
Other articles published on Jan 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+