For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వన్డే అవార్డు: కోహ్లితో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు పోటీ

2023 ఏడాదికి గానూ అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు ఇవ్వడానికి ఐసీసీ సిద్ధమైంది. మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు కోసం నలుగురు ప్లేయర్లను నామినేట్ చేసింది. అందులో ముగ్గురు టీమిండియా ప్లేయర్లే ఉండటం విశేషం. విరాట్ కోహ్లి, మహ్మద్ షమి, శుభ్‌మన్ గిల్‌తో పాటు న్యూజిలాండ్ హిట్టర్ డారిల్ మిచెల్ అవార్డు రేసులో ఉన్నారు.

ఐసీసీ 2004 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఇప్పటివరకు అత్యధికంగా విరాట్ కోహ్లి నాలుగు సార్లు అవార్డు అందుకున్నాడు. 2010, 2012, 2017, 2018లో ఈ ఘనత సాధించాడు. అయితే ఈ ఏడాది కూడా కోహ్లి గట్టిపోటీదారుగా ఉన్నాడు. 2023లో కోహ్లి సూపర్ ఫామ్ కొనసాగిస్తూ 27 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 1377 పరుగులు చేశాడు. దీనిలో ఆరు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 12 క్యాచ్‌లు అందుకున్న కోహ్లి ఒక్క వికెట్ కూడా తీశాడు. అంతేగాక వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

ICC Mens ODI Cricketer of the Year 2023: Two Indian players Gill and Shami compete with Virat Kohli

మరోవైపు పోటీలో నిలిచిన గిల్, షమి కూడా 2023లో గొప్ప ప్రదర్శన చేశారు. గిల్ 29 మ్యాచ్‌ల్లో 63 సగటుతో 1584 పరుగులు చేశాడు. అందులో డబుల్ సెంచరీ కూడా ఉంది. షమి 19 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్‌లో 7 మ్యాచ్‌లే ఆడిన అతడు ఏకంగా 24 వికెట్లు సాధించాడు. కివీస్ ప్లేయర్ మిచెల్ 26 మ్యాచ్‌ల్లో 1204 పరుగులు చేశాడు. 9 వికెట్లు కూడా తీశాడు.

ICC Mens ODI Cricketer of the Year 2023: Two Indian players Gill and Shami compete with Virat Kohli

అవార్డులకు నామినేట్ అయిన ప్లేయర్లు
ICC మెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: శుభ్‌మన్ గిల్ (భారత్), విరాట్ కోహ్లి (భారత్), డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), మహ్మద్ షమి (భారత్)
ICC ఉమెన్స్ ODI క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: చమరి (శ్రీలంక), ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా), అమేలియా కెర్ (న్యూజిలాండ్), నాట్ స్కివర్ బ్రంట్ (ఇంగ్లాండ్)

ICC Mens ODI Cricketer of the Year 2023: Two Indian players Gill and Shami compete with Virat Kohli

ICC మెన్స్ T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: మార్క్ చాప్‌మన్ (న్యూజిలాండ్), అల్పేష్ రంజనీ (ఉగాండా), సికందర్ రజా (జింబాబ్వే), సూర్యకుమార్ యాదవ్ (భారత్)
ICC ఉమెన్స్ T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: చమరి (శ్రీలంక), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా)

ICC ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: జెరాల్డ్ కొయెట్జీ (దక్షిణాఫ్రికా), యశస్వి జైస్వాల్ (భారత్), మదుశంక (శ్రీలంక), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్)
ICC ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్; మరుఫా అక్టర్ (బంగ్లాదేశ్), లారెన్ బెల్ (ఇంగ్లాండ్), డార్సీ కార్టర్ (స్కాట్లాండ్), లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా)

Story first published: Friday, January 5, 2024, 8:51 [IST]
Other articles published on Jan 5, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+