
పరుగుల టాపర్ జో రూట్..
ఈ ఏడాది 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జో రూట్ 29 ఇన్నింగ్స్‌లో 61 సగటుతో 1,708 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 228. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జో రూటే. కెప్టెన్‌గా ఇంగ్లండ్‌కు విజయాలందించడంతో రూట్ విఫలమైనా.. వ్యక్తిగతంగా మాత్రం రాణించాడు. ఈ క్రమంలోనే ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ బ్యాటర్ మహ్మద్ యూసుఫ్(1788), వివి రిచర్డ్స్(1710) రూట్ కన్నా ముందున్నారు.

52 వికెట్లతో అశ్విన్..
టీమిండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అవ్విన్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌ల్లో(సౌతాఫ్రికాతో మ్యాచ్‌ను మినహాయించి) 16.23 సగటుతో 52 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 28.08 సగటుతో 337 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో అశ్విన్.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ డ్రాతో మొదలైన అతని అద్భుత ప్రదర్శన.. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు టెస్ట్‌ల సిరీస్ వరకు కొనసాగింది. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఓ సెంచరీతో 189 పరుగులతో పాటు బౌలింగ్‌లో 32 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 4 వికెట్లు తీసిన అశ్విన్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కూడా అశ్విన్ కీలకం కానున్నాడు.

కివీస్ హీరో కైల్ జెమీసన్..
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కివీస్ గెలుచుకోవడంలో కైల్ జెమీసన్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది 5 మ్యాచ్‌లు ఆడిన జెమీసన్ 17.51 యావరేజ్‌తో 27 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్‌లో 17.50 సగటుతో 105 రన్స్ చేశాడు. ముఖ్యంగా భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో జెమీసన్ బంతితో మెరిసాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్‌లో టెయిలండర్లతో కలిసి విలువైన పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేసి భారత్ కోలుకోకుండా దెబ్బతీసాడు. శ్రీలంకకు చెందిన దిముత్ కరుణరత్నే 7 మ్యాచ్‌ల్లో 69.38 సగటుతో 902 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి.

ఓటింగ్ ద్వారా విజేత..
మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ ఏడాది కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ప్రతీ ఫార్మాట్‌కు షార్ట్ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.