For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మార్పులు చేయనున్న ఐసీసీ.. టెస్టులు ఇక నాలుగు రోజులే!!

ICC likely to consider introduction of four-day Test cricket from 2023

మెల్‌బోర్న్‌: సంప్రదాయ క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. టీ20లకు ధీటుగా టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేందుకు దేశవాళీ తరహాలోనే ఇక టెస్టులను నాలుగు రోజులకు పరిమితి చేసే ఆలోచనలో ఉంది. అయితే దీనికి కాస్త సమయం పట్టనుంది.

టెస్టులు ఇక నాలుగు రోజులే

టెస్టులు ఇక నాలుగు రోజులే

ఐసీసీ సంప్రదాయ క్రికెట్‌ను తప్పనిసరిగా కుదించాలనే ఆలోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట నాలుగు రోజులకే పరిమితం కానుంది. 2023-2031 మధ్య కాలంలో టెస్టులను ఐదు రోజులు కాకుండా నాలుగు రోజుల పాటు నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. దీంతో బిజీగా ఉండే అంతర్జాతీయ క్రికెట్‌ షెడ్యూల్‌లో ఆయా బోర్డులకు విరామం దొరుకుతుంది. ఈ సమయంలో మరిన్ని గ్లోబల్‌ ఈవెంట్స్‌ నిర్వహణకు వీలవుతుందని ఐసీసీ ఆలోచన.

335 రోజుల విరామం దొరికేది

335 రోజుల విరామం దొరికేది

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్‌ చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు లీగ్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బీసీసీఐ చేసిన ప్రతిపాదనల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఒకవేళ 2015-2023 మధ్య ఈ నాలుగు రోజుల టెస్టులు జరిగుంటే 335 రోజుల విరామం దొరికేది.

కొత్తేం కాదు

కొత్తేం కాదు

అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు రోజుల టెస్టులు కొత్తేం కాదు. ఇదివరకే ఈ ఏడాది ఇంగ్లండ్, ఐర్లాండ్‌ల మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. 2017లోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడాయి. ఈ మార్పు స్వాగతించదగినదే అని క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ అభిప్రాయపడ్డాడు.

ఇపుడే స్పందిస్తే తొందరపాటే

ఇపుడే స్పందిస్తే తొందరపాటే

నాలుగు రోజుల టెస్టుకు ఇంకా చాలా రోజులు పడుతుందని దీనిపై ఇప్పుడే స్పందిస్తే తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. 'ముందుగా వారి ప్రతిపాదన పరిశీలించాలి. అది ఆచరణలోకి వచ్చాక ఆలోచించవచ్చు. ఇప్పుడే స్పందించడం తొందరపాటు అవుతుంది' అని దాదా పేర్కొన్నాడు.

Story first published: Tuesday, December 31, 2019, 8:25 [IST]
Other articles published on Dec 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+