2000 ఛాంపియన్స్ ట్రోఫీ (ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్ లో భారత్ పై సెంచరీ బాది విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆటగాడు అతడు. ఫియర్‌లెస్ క్రికెటర్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్ అభిమాన మనసు దోచుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ అతడు. కానీ ఆ తర్వాత పాతాళానికి దిగజారిపోయి.. కూలీగా, క్లీనర్ గా కెరీర్ జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అతడు మరెవరో కాదు క్రిస్ కెయిన్స్.
హాలీవుడ్ హీరోలా..
హాలీవుడ్ హీరో లాంటి అందమైన రూపం, రింగుల జుత్తు.. ఆటలో ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్ క్రికెటర్‌గా ఎదిగాడు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అని తరచుగా వింటూనే ఉంటాం. క్రిస్ కెయిన్స్ జీవితంలోనూ ఇదే జరిగింది.

విలాసాలకు అలవాటుపడి..
క్రిస్ కెయిన్స్ కు ఆస్తి పాస్తులూ బాగానే ఉండేవి. కానీ అతడు ఆటలో రిటైర్ అవ్వకముందే స్వీయ తప్పిదాలతో ఆర్థికంగా పాతాళానికి పడిపోయాడు. కెయిన్స్ ఆ రోజుల్లో వజ్రాల వ్యాపారం కూడా చేశాడు. కానీ విలాసాలకు అలవాటుపడి డబ్బును పొదుపు చేయలేకపోయాడు. చివరకు అప్పులు, నష్టాలు అతడి జీవితాన్ని నిండా ముంచేశాయి. ఈ క్రమంలోనే ఆటలోనూ కిందకు పడిపోయాడు. చివరకు ప్రాణాపాయ స్థితిలోనూ మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి ఓ దశలో గుండెపోటుతో ఆస్పత్రిలోనూ చేరాడు. చికిత్సకు డబ్బులు లేక ఎంతో అవస్థలు పడ్డాడు. ఫైనల్ గా తన జీవితం గడవడానికి కూలీగా మారాడు కెయిన్స్. ట్రక్ డ్రైవర్‌గానూ పని చేశాడు. చివరికి బస్సులు కూడా శుభ్రం చేశాడు.
Happy Birthday Chris Cairns 🇳🇿
— Zohaib (Cricket King)🇵🇰🏏 (@Zohaib1981) June 13, 2023
👉8273 International Runs
👉420 International Wickets
👉81 International Catches
👉Wisden Cricketer of the Year 2000
👉How good he was as a bowler. Magical Delivery to bowled @sachin_rt at Cuttack 1995.pic.twitter.com/O8Y11KsUWJ
420 వికెట్లు.. 240 సిక్స్‌లు..
కెయిన్స్ తన కెరీర్ లో 62 టెస్టులు, 215 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. 8273 పరుగులు చేశాడు. 420 వికెట్లు తీశాడు. 81 క్యాచులు పట్టుకున్నాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి 240 సిక్స్ లు బాదాడు. 2000వ సంవత్సరంలో 5 విస్డెన్ క్రికెటర్ గా నిలిచాడు.