ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్: లిటన్ దాస్ ఔట్‌పై ట్విట్టర్‌లో బంగ్లా ఫ్యాన్స్

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది.
అయితే, ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్‌ను మూడో అంపైర్ స్టంపౌట్‌గా ప్రకటించిన తీరు వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 41వ ఓవర్‌లో కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడేందుకు ముందుకు వెళ్లిన లిటన్ దాస్ బంతి మిస్ కావడంతో అంతే వేగంగా క్రీజు లైన్‌పై కాలు పెట్టాడు. అప్పటికే ధోని చాలా వేగంగా వికెట్లను గిరాటేశాడు.
దీంతో నిర్ణయం మూడో అంపైర్‌కు వెళ్లడంతో చాలాసేపు రీప్లేలో చూసినా స్పష్టత కనిపించలేదు. లిటన్ కాలి వేళ్లు లైన్ వెనకభాగంలో ఉన్నట్టు కనిపించలేదు. దీంతో అతన్ని ఔట్‌గా ప్రకటించడంతో టీమిండియా కాస్త ఊపిరిపీల్చుకుంది. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్ణయం బ్యాట్స్‌మన్‌కు ఇవ్వకపోవడంపై బంగ్లా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ లాగా మారింది
ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ లాగా మారిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఐసీసీ అంటే బీసీసీఐలాగా మారిందని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు. కాలు స్పష్టంగా లైన్‌పై ఉన్నా కూడా ఔట్‌గా ప్రకటించడం దారుణమని మరొక నెటిజన్ తన ఆవేదనను వెళ్లగక్కాడు. లిటన్ దాస్ ఔటైన తర్వాత భారీ సిక్సర్‌తో ఊపు మీద కనిపించిన కెప్టెన్ మష్రఫె మొర్తజా కూడా కుల్దీప్ మరుసటి ఓవర్‌లో ధోనినే స్టంపౌట్ చేయడం విశేషం.
20.4 ఓవర్లలోనే 120 పరుగులు చేసిన బంగ్లాదేశ్
నిజానికి ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తమ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ లిటన్ దాస్ సెంచరీతో రాణించడంతో జట్టు స్కోరు 20.4 ఓవర్లలోనే 120 పరుగులకు చేరింది. ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు.. ఎనిమిదో ఓవర్‌లో రెండు సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. హాఫ్ సెంచరీ తర్వాత లిటన్ ఇచ్చిన క్యాచ్‌ను చాహల్ వదిలేశాడు. తనకు అందివచ్చిన లైఫ్‌తో లిటన్ దాస్ సెంచరీతో చెలరేగాడు.
300 పరుగులు చేయడం ఖాయమని అనుకున్నారంతా!
ఈదశలో బంగ్లాదేశ్ ఆటతీరు చూస్తే 300 పరుగులకు చేరడం ఖాయమని అంతా భావించారు. అయితే, కేదార్ జాదవ్, కుల్దీప్ స్పిన్ మాయతో ఆ తర్వాత మరో 102 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. 21వ ఓవర్‌లో కేదార్ జాదవ్ మెహదీ హసన్‌ను ఓట్ చేయడంతో తొలి వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇమ్రుల్ కయేస్ (2), ప్రమాదకర ముష్ఫికర్ (5) త్వరగానే పెవిలియన్‌కు చేరారు.
81 పరుగులకు ఏడు వికెట్లు
మరోవైపు లిటన్ దాస్ మాత్రం నిలకడను కొనసాగిస్తూ 87 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా కొద్దిసేపటికే మహ్మదుల్లా (4) కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ దశలో వరుసగా వికెట్లు పడుతుండడంతో బంగ్లా స్కోరు బోర్డులో వేగం తగ్గింది. మిగతా బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లడంతో చివరి 25 ఓవర్లలో జట్టు 81 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications