బంగ్లాదేశ్‌తో సెకండ్ టెస్టు మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడంతో ఆనందంలో ఉన్న న్యూజిలాండ్ పేసర్ కైలీ జెమీషన్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) భారీ షాకిచ్చింది. ప్రవర్తనా నియమావళి కింద జేమీషన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అంతేకాకుండా డిసిప్లనరీ రికార్డులో ఒక డిమెరిట్ పాయింట్‌ను చేర్చింది. అసలు ఏం జరిగిందంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోంది. 41వ ఓవర్ జేమీషన్ వేశాడు. ఆ ఓవర్లో 2 పరుగులు చేసిన యాసర్ అలీ.. వాగ్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో జేమీషన్ అసభ్యకర పదజాలం వాడాడు. దీన్ని అంపైర్లు గుర్తించి ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమాళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం కైలీ జెమీషన్పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్లో ఒక బ్యాటర్‌ను ఔట్ చేసిన తర్వాత వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే అత్యధికంగా 50 శాతం వరకు ఫైన్ విధించడానకి అనుమతి ఉంది.
జెమీషన్ ఇలా వ్యవహరించడం గత 2 సంవత్సరాల్లో ఇది మూడో సారి. గత ఏడాది మార్చి 23న బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్ సందర్భంగా, 2020 డిసెంబర్ 28న పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కూడా జెమీషన్ ఇలాగే వ్యవహరించాడు. ఈ మూడు సార్లు కూడా ఐసీసీ డీమెరిట్ పాయింట్లు చేర్చడంతో జేమీషన్ డీమెరిట్ పాయింట్ల సంఖ్య మూడుకు చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ చివరి వికెట్ తీయడం ద్వారా ఆ జట్టు దిగ్గజ బ్యాటర్ రాస్ టేలర్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 521 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు కెప్టెన్ లాథమ్ డబులు సెంచరీతో చెలరేగగా, కాన్వే సెంచరీతో సత్తా చాటాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌట్ అయింది.సెకండ్ 278 పరుగులకు ఆలౌట్ అయింది.