Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్లపై ఇంత ఔదార్యం ఎందుకు?: మాజీ క్రికెటర్ల మండిపాటు

ICC hands Smith one-match suspension. Bancroft slapped with three demerit points

హైదరాబాద్: కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌ను ప్రోత్సహించి, సహచర క్రికెటర్‌తో తప్పు చేయించినందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌పై ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించిన సంగతి తెలిసిందే.

ఇక, టాంపరింగ్‌కు పాల్పడిన బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత, మూడు డీమెరిట్ పాయింట్లను అతడి ఖాతాలో చేర్చింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం తీర్పు అంటూ మాజీ క్రికెటర్లు ఐసీసీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.

ఆస్ట్రేలియా విషయానికి వచ్చేసరికి ఐసీసీ ఔదార్యం

ఆస్ట్రేలియా విషయానికి వచ్చేసరికి ఐసీసీ ఔదార్యం

చిన్నతప్పులకే జరిమానాలని.. డీమెరిట్‌ పాయింట్లని మిగతా దేశాలపై కఠినంగా వ్యవహరించే ఐసీసీ.. ఆస్ట్రేలియా విషయానికి వచ్చేసరికి ఔదార్యం చూపుతోందని మాజీలు మండిపడ్డారు. ఒకప్పుడు బంతికి అంటుకున్న మట్టి తుడిచినందుకే క్రికెట్ లెజెండ్ సచిన్‌పై మ్యాచ్‌ నిషేధం వేసి ఐసీసీ అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ బాల్ టాంపరింగ్ వివాదానికి పాల్పడిన ఐసీసీకి కంగారూలంటేనే ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది.

ఆస్ట్రేలియన్లపై ఇంత ఔదార్యం ఎందుకు?

ఆస్ట్రేలియన్లపై ఇంత ఔదార్యం ఎందుకు?

మంకీగేట్‌ వివాదంలో దోషిగా తేలకున్నా హర్భజన్‌పై మూడు నెలల వేయడాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచం మొత్తం ఆస్ట్రేలియా క్రికెటర్లను చీటర్స్‌ అంటూ దుమ్మెత్తిపోస్తున్న వారిపై ఇంత ఔదార్యం ఎందుకని ప్రశ్నించారు. బాల్‌ టాంపరింగ్‌‌కు ప్రోత్సహించిన కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌లను క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఆ బాధ్యతల నుంచి తప్పించింది. నాలుగో రోజు ఆటలో టిమ్ పెయినీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లను హేళన చేసిన దక్షిణాఫ్రికా అభిమానులు

ఆస్ట్రేలియా ఆటగాళ్లను హేళన చేసిన దక్షిణాఫ్రికా అభిమానులు

బాల్‌ టాంపరింగ్‌ అనంతరం ఆదివారం తిరిగి ప్రారంభమైన నాలుగో రోజు దక్షిణాఫ్రికా అభిమానులు సైతం మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లను హేళన చేశారు. మూడో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఆసీస్‌ ఆటగాడు బాన్‌క్రాఫ్ట్‌ ఓ టేపుతో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడుతూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోవడం, సీనియర్‌ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే.

క్షమించరాని తప్పు: క్లార్క్

క్షమించరాని తప్పు: క్లార్క్

‘మైదానంలో తమ సహచర ఆటగాళ్లు చేసింది క్షమించరాని తప్పుగా అభివర్ణించాడు. అదేవిధంగా స్టీవ్‌ స్మిత్‌కు, సహచర ఆటగాళ్లకు తన తరఫున పూర్తి సానుభూతి ప్రకటిస్తున్నా. స్టీవ్‌ స్మిత్‌ చేసింది చాలా పెద్ద తప్పు అని నా మనస్సు తలుస్తోంది. కానీ ఈ సమస్యకు ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌ తిరిగి కొనసాగుతాడా? దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న సంగతి గుర్తురెగాలి. అవసరమొస్తే జట్టుకు తిరిగి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నా' అని మైకేల్ క్లార్క్ అన్నాడు.

ఎంత గొప్ప తీర్పో?: హర్భజన్‌సింగ్

ఎంత గొప్ప తీర్పో?: హర్భజన్‌సింగ్

'ఆహా ఐసీసీ! ఎంత గొప్ప తీర్పో? బాల్ టాంపరింగ్ వివాదంలో మీ నిర్ణయం పూర్తిగా వివక్ష పూరితం. అన్ని ఆధారాలు ఉన్నా బాన్‌క్రాఫ్ట్‌పై ఎలాంటి సస్పెన్షన్ లేదు. 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతిగా అప్పీల్ చేసినందుకు సచిన్, సౌరవ్, శివసుందర్, దీప్‌దాస్ గుప్తా, సెహ్వాగ్‌పై ఒక్కో టెస్ట్ సస్పెన్షన్ వేశారు. 2008 సిడ్నీ టెస్టు సందర్భంగా నా తప్పేమీ లేకున్నా 3 మ్యాచ్‌లు నిషేధించారు. కానీ అన్ని సాక్ష్యాలున్నా బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం లేదు. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు శిక్షలా. ఆస్ట్రేలియా జట్టు మొత్తాన్ని శిక్షించాలి' అని భజ్జీ అన్నాడు.

ఒక్క మ్యాచ్ నిషేధంతో సరిపెట్టుతారా?: మైకెల్ వాన్

ఒక్క మ్యాచ్ నిషేధంతో సరిపెట్టుతారా?: మైకెల్ వాన్

'ఒక అంతర్జాతీయ కెప్టెన్ మోసం చేశానని అంగీకరించినా అతడిపై ఒక్క మ్యాచ్ నిషేధంతో సరిపెట్టుతారా? బాన్‌క్రాఫ్ట్‌కు 75 శాతం మ్యాచ్ ఫీజు కోత సరిపోతుందా? మోసం చేసినందుకు తీవ్రమైన శిక్షలు విధించాలి. వైస్ట్ కెప్టెన్‌తో సహా నాయకత్వ సమూహంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమేమిటి? ఐసీసీలో చాలా మార్పు రావాలి' అని మైకెల్ వాన్ అన్నాడు.

Story first published: Monday, March 26, 2018, 9:49 [IST]
Other articles published on Mar 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+