For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చండిమాల్‌పై సస్పెన్షన్‌: బాల్ టాంపరింగ్ ఎంత పని చేసింది?

By Nageshwara Rao
Ball Tampering : Dinesh Chandimal Got Suspended By Icc
ICC hands one-Test ban to Dinesh Chandimal for ball tampering

హైదరాబాద్: శ్రీలంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్‌పై ఐసీసీ వేటు వేసింది. కరేబియన్ గడ్డపై వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో దినేశ్ చండీమాల్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ అతడిపై ఓ టెస్టు మ్యాచ్‌ సస్పెన్షన్‌ విధించాడు.

దీంతోపాటు మ్యాచ్‌ ఫీజులో వందశాతం జరిమానా విధించింది. ఫలితంగా వెస్టిండిస్‌తో జరిగే మూడో టెస్టుకు దినేశ్ చండీమాల్ దూరం కానున్నాడు. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని తొలుత బుకాయించిన చండీమాల్ ఆ తర్వాత నిజాన్ని అంగీకరించాడు. బాల్‌ను షైన్ చేసేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో వెల్లడైంది.

కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా

మ్యాచ్ వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జవగళ్ శ్రీనాథ్ మాట్లాడుతూ బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందని అన్నాడు. దానికి లాలాజలం రాసి బంతిని మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనావళిని అనుసరించి అతడిపై చర్యలు తీసుకున్నట్టు వివరించాడు. చండీమాల్‌పై సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని ఐసీసీ కూడా సమర్ధించింది. బాల్ టాంపరింగ్ విషయంలో మ్యాచ్ అధికారులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఐసీసీ ఈ సందర్భంగా తెలిపింది.

డ్రాగా ముగిసిన రెండో టెస్టు

ఇదిలా ఉంటే వెస్టిండీస్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ బ్యాట్స్‌మెన్‌ను ఆఖరి రోజైన సోమవారం శ్రీలంక బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో విండిస్ ఓపెనర్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (59 నాటౌట్‌; 172 బంతుల్లో 6 ఫోర్లు), హోప్‌ (39; 115 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది. రెండో ఇన్నింగ్స్‌‌లో వెస్టిండిస్ ఐదు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రాత్‌వైట్‌ బాధ్యతాయుతంగా ఆడి ఓటమి నుంచి తప్పించాడు. అయితే చివరి సెషన్‌లో వాతావరణం అనుకూలించక పోవటంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు.

ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసిన వెస్టిండిస్

మ్యాచ్‌ ముగిసే సయయానికి వెస్టిండీస్‌ ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులతో ఉంది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సత్తా చాటిన విండీస్‌ బౌలర్‌ గాబ్రియేల్‌ (13/121)కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరిస్‌లో వెస్టిండీస్‌ 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరిస్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండిస్ 226 పరుగలు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

శనివారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం

ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు శనివారం నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఈ టెస్టులో శ్రీలంక కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌పై ఐసీసీ బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విండిస్‌తో జరిగిన ఈ టెస్టులో చండీమాల్‌ ఉద్దేశ్యపూర్వకంగానే బంతి ఆకారాన్ని దెబ్బ తీసినట్లు ఐసిసి పేర్కొన్న సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, June 20, 2018, 10:15 [IST]
Other articles published on Jun 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+