అసలేం జరిగింది?: వివాదంలో కోహ్లీ, క్లీన్ చిట్ ఇచ్చిన ఐసీసీ
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కివీస్‌పై పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.

వివాదంలో చిక్కుకున్న విరాట్ కోహ్లీ
అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. డగౌట్‌లో జట్టు సభ్యులతో కూర్చున్న కోహ్లీ వాకీ టాకీలో మాట్లాడుతూ కనిపించాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా కోహ్లీ ప్రవర్తించాడంటూ నెటిజన్లు మండిపడ్డారు.

తప్పేమీ లేదని ఐసీసీ క్లీన్ చిట్
అయితే కోహ్లీ చేసిన దానిలో తప్పేమీ లేదంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్లీన్ చిట్ ఇచ్చింది. కేవలం జట్టు సహాయక సిబ్బంది మాత్రమే డగౌట్‌లో గానీ, లేక డ్రెస్సింగ్ రూమ్‌లో గానీ ఆటగాళ్లను సంప్రదించేందుకు వాకీ టాకీ వినియోగిస్తారని, అయితే కోహ్లీ ఆ నిబంధనలను ఉల్లంఘించాడని ఆరోపణలు రావడంతో దీనిపై ఐసీసీ అధికారి వివరణ ఇచ్చారు.

పర్మిషన్ తీసుకున్నారన్న ఐసీసీ
ఆ వాకీ టాకీ వినియోగించడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంబంధిత అధికారిని అడిగి పర్మిషన్ తీసుకున్నారని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఐసీసీ అవినీతి నిరోధక భద్రతా విభాగం అనుమతితోనే కోహ్లీ వాకీ టాకీలో సంభాషించాడని ఆయన వెల్లడించారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో మొబైల్ ఫోన్లు నిషేధం
వాస్తవానికి మొబైల్ ఫోన్లను డ్రెస్సింగ్ రూమ్‌లో నిషేధించారు. అయితే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఐసీసీ నిబంధనల ప్రకారం వాకీ టాకీ వాడవచ్చుననే నిబంధన ఉంది. ఈ నిబంధన తెలియకపోవడం వల్లే కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడని పలువురు అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications