ఐదుకు బదులు ఆరు: ధర్మసేనను వెనుకేసుకొచ్చిన ఐసీసీ

హైదరాబాద్: ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో ఐదు పరుగులు బదులుగా ఆరు పరుగులు ఇచ్చిన అంఫైర్ కుమార ధర్మసేనపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఓవర్ త్రోపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ధర్మసేనను వెనకేసుకొచ్చింది.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఓవర్‌త్రోపై పరుగులను నిర్ణయించడానికి అంపైర్లు సరైన ప్రక్రియనే అవలింబించారని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డెస్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ "ఫీల్డర్ త్రో విసిరినప్పుడు బ్యాట్స్‌మెన్ క్రీజును దాటారా లేదా అనే విషయాన్ని ఆన్‌ఫీల్డ్ అంపైర్లే గమనించాలి. ఆ త్రో వేశా క అంపైర్లిద్దరూ చర్చించుకున్నారు. ఆ తర్వాతే ఆరు పరుగుల నిర్ణయం వెలువరించారు" అని అన్నాడు.

సరైన ప్రక్రియనే అవలంబించారు
"వారు సరైన ప్రక్రియనే అవలంబించారు. రివ్యూ కోసం థర్డ్ అంపైర్‌ను సంప్రదించేందుకు అప్పటి పరిస్థితుల్లో వారికి అవకాశం లేదు. అలాంటి తీర్పును మైదానంలో ఉన్న వారే ఇవ్వాలి. మ్యాచ్ రిఫరీ జోక్యం చేసుకోలేరు" అని జియోఫ్ తెలిపారు. కాగా, ఓవర్ త్రో విషయంలో తాను తీసుకున్న నిర్ణయం తప్పేనని మ్యాచ్ అనంతరం ధర్మసేన వ్యాఖ్యానించడం గమనార్హం.

అసలేం జరిగింది?
ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో అనూహ్యంగా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి.

ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితం తారుమారు
ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications