
టాప్ 4 ప్రైజ్ మనీ వివరాలు
విజేత - 1.6మిలియన్ల డాలర్లు ( రూ. 13.05కోట్లు)
రన్నరప్ - 8లక్షల డాలర్లు (రూ.6.52 కోట్లు)
సెమీ ఫైనలిస్టులు - సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు చెరో 4లక్షల డాలర్లు (రూ.3.26కోట్లు)

సూపర్ 12లో నిష్క్రమించిన జట్లకు ప్రైజ్‌మనీ ఇలా..
అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలోని 7 వేదికలలో మొత్తం 45 మ్యాచ్‌ల టోర్నమెంట్ ఇది. టీ20 ప్రపంచకప్ ఫస్ట్ రౌండ్, సూపర్ 12 రౌండ్, సెమీఫైనల్స్, ఫైనల్స్ అనే ఫార్మాట్ ప్రకారం జరుగుతుంది. ఇకపోతే సూపర్ 12దశలో మొత్తం 12జట్లు పాల్గొంటుండగా.. అందులో రెండు గ్రూపులున్నాయి. చెరో గ్రూపులో 6జట్లు ఉంటాయి. గ్రూపు పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. దీంతో మిగిలిన నాలుగు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. ఇలా రెండు గ్రూపుల నుంచి మొత్తం ఎనిమిది జట్లు సూపర్ 12దశలో నిష్క్రమిస్తాయి. ఇలా నిష్క్రమించే ఒక్కో జట్టుకు 70వేల డాలర్ల ప్రైజ్ మనీ ఐసీసీ అందిస్తుంది. అంటే భారత కరెన్సీలో 57.09లక్షల రూపాయల ప్రైజ్ మనీ అన్నమాట.
గెలిస్తే చాలు కాసులే..
ఇకపోతే సూపర్ 12 దశలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లలో ప్రతి మ్యాచ్ గెలుపునకు అదనంగా 40వేల డాలర్ల విన్నింగ్ ప్రైజ్ మనీ కూడా దక్కుతుంది. అంటే రూ.32.62లక్షల రూపాయలన్నమాట. గ్రూప్ ఏలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, రౌండ్ 1 క్వాలిఫై అయిన రెండు జట్లు, గ్రూప్ బీలో భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, రౌండ్ 1లో క్వాలిఫై అయిన రెండు జట్లు ఉంటాయి.

ఫస్ట్ రౌండ్లో ప్రైజ్ మనీ ఇలా
ఇకపోతే ఫస్ట్ రౌండ్లో మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపడి పోటీపడతాయి. ఇందులో ప్రతి గ్రూపులో టాప్ 2లో నిలిచిన రెండు జట్లు సూపర్ 12దశకు చేరుతాయి. ఇకపోతే ఈ రౌండ్లో నాలుగు జట్లు నిష్క్రమిస్తాయి. అలా నిష్క్రమించిన జట్లకు రూ.32.62లక్షల ప్రైజ్ మనీ అందుతుంది. అయితే ఈ స్టేజులో 12 మ్యాచ్‌ల్లో ప్రతి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు రూ.40వేల డాలర్ల (రూ.32.62లక్షల) ప్రైజ్ మనీ అందుతుంది. ఈ స్టేజులో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గ్రూప్ ఏలో ఉండగా.. ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే గ్రూప్ బీలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications
