Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC New Rules: బాల్‌పై ఉమ్మిరాయడం ఇక కంప్లీట్ బ్యాన్.. ఫీల్డర్లు హద్దు మీరితే 5రన్స్ పెనల్టీ.. ఇవిగో రూల్స్!

ICC Declared Several New Rules Including complete Ban On Aplying saliva on Ball

సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని మెన్స్ క్రికెట్ కమిటీ సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) ఆమోదించడంతో ఐసీసీ క్రికెట్ నిబంధనల్లో పలు మార్పులను ప్రకటించింది. ఇకపోతే తాజా ఐసీసీ ప్రకటన ద్వారా క్రికెట్లో మారిన పలు రూల్స్ గురించి ఓసారి పరిశీలిద్దాం. ఈ రూల్స్ అక్టోబర్ 1నుంచి అమల్లోకి రానున్నాయి.

అక్టోబర్ 1నుంచి అమలయ్యే రూల్స్ ఇవే

అక్టోబర్ 1నుంచి అమలయ్యే రూల్స్ ఇవే

1. క్యాచ్ ఔటయ్యాక కొత్ బ్యాటర్ క్రీజులోకి : ఒక బ్యాటర్ క్యాచ్ అవుట్ అయినప్పుడు.. క్యాచ్ అవుట్‌కు ముందు బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ అయ్యారా లేదా అనేదానితో సంబంధం లేకుండా.. స్ట్రైకింగ్ కొత్త బ్యాటర్‌కు లభిస్తుంది.

2. బంతిపై ఉమ్మిరాయడం పూర్తిగా బ్యాన్ : కరోనా తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో బాల్‌పై ఉమ్మిరాయడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన గత రెండు సంవత్సరాలుగా అమలులో ఉంది. అయితే తాజా నిబంధనల ప్రకారం ఉమ్మిరాయడం ఇక కంప్లీట్ బ్యాన్.

3. ఇన్‌కమింగ్ బ్యాటర్ రెడీగా ఉండాలి : టెస్ట్‌లు, వన్డేలలో రెండు నిమిషాల వ్యవధిలోనే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్లోకి వచ్చి బాల్ ఫేస్ చేయడానికి సిద్ధం కావాలి. ఈ విషయం టీ20లలో ప్రస్తుతం తొంభై సెకన్లుగా ఉంది.

4. బంతిని ఆడటానికి స్ట్రైకర్ హక్కు: స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ తన బ్యాట్‌ను గానీ, తన కాలు కొంత భాగాన్ని పిచ్‌లో ఉండేలా చూసుకోవాలి. వారు పిచ్ వీడి లెగ్ సైడ్ గానీ ఆఫ్ సైడ్ గానీ బయటికి వస్తే దాన్ని అంపైర్ డెడ్ బాల్‌‌గా ప్రకటిస్తాడు. ఇకపోతే బౌలర్ స్ట్రైకర్‌కు అందకుండా ఆఫ్ సైడ్ గానీ, లెగ్ సైడ్ గానీ చాలా దూరంగా బంతి వేస్తే.. (వైడ్‌కు మించి) అంపైర్ నో బాల్ ప్రకటిస్తాడు.

5. ఫీల్డింగ్ కదలికలో తప్పు చేస్తే : పవర్ ప్లే, తదితర నిబంధనలకు విరుద్ధంగా బౌలర్ బౌలింగ్ చేయడానికి పరిగెత్తుతున్నప్పుడు ఫీల్డర్ తప్పుగా కదలాడితే, లేదా ఉద్దేశపూర్వకంగా నిబంధనలు అతిక్రమిస్తే అప్పుడు అంపైర్ డెడ్ బాల్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ జట్టుకు పెనాల్టీ విధిస్తూ.. బ్యాటింగ్ జట్టు స్కోరులో అయిదు పరుగులు కలుపుతాడు.

6. నాన్ స్ట్రైకర్ రన్నింగ్ ఔట్ : నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రనౌట్ అయ్యే పద్ధతిని ఇప్పుడు అన్‌ఫెయిర్ ప్లే విభాగం నుండి రన్ అవుట్ విభాగానికి మార్చారు. గతంలో మాన్కడింగ్‌గా పెద్ద దుమారం రేపిన ఈ పద్ధతిని ఇప్పుడు చట్టబద్ధం చేశారు.

7. డెలివరీకి ముందు స్ట్రైకర్ వైపు బంతి విసరడం : ఇంతకు ముందు..బౌలర్ తమ డెలివరీ స్ట్రైడ్‌లోకి ప్రవేశించేముందే బ్యాటర్ వికెట్ల నుంచి పిచ్ ముందుకు దూసుకువస్తే.. బౌలర్ స్ట్రైకర్‌ను రనౌట్ చేయడానికి బంతిని విసిరేవాడు. ఇప్పుడు అలా కుదరదు దాన్ని డెడ్ బాల్‌గా పేర్కొంటారు.

8 .ఇతర ప్రధాన నిర్ణయాలు : జనవరి 2022లో టీ20Iలలో ప్రవేశపెట్టిన పెనాల్టీ ఫీల్డ్ పరిమితులు. (ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయానికి తమ ఓవర్లను బౌలింగ్ చేయడంలో విఫలమైతే.. మిగిలిన ఓవర్లకు ఫీల్డింగ్ సర్కిల్‌లోకి అదనపు ఫీల్డర్‌ని తీసుకురావలసి వస్తుంది.). 2023లో ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ పూర్తయిన తర్వాత వన్డేలలో కూడా ఈ నిబంధనను తీసుకురానున్నారు.

అన్నీ నిబంధనలు అప్డేట్ అవుతాయి : గంగూలీ

అన్నీ నిబంధనలు అప్డేట్ అవుతాయి : గంగూలీ

ఈ మార్పులను ప్రతిబింబించేలా అన్ని ప్లేయింగ్ కండిషన్‌లు అప్‌డేట్ అవుతాయని ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చీఫ్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. 'నేను ఐసీసీ క్రికెట్ కమిటీ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించడం చాలా గౌరవంగా ఉంది. కమిటీ సభ్యుల సహకారం పట్ల నేను సంతోషిస్తున్నాను. మేము కీలక సిఫార్సులు చేశాం. సభ్యులు వారు తమ విలువైన ఇన్‌పుట్లు అందించారు. వారందించిన సూచనల పట్ల కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అని గంగూలీ తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యులు వీరే

ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యులు వీరే

సౌరవ్ గంగూలీ (ఛైర్ పర్సన్); రమీజ్ రాజా (పరిశీలకుడు); మహేల జయవర్దనే, రోజర్ హార్పర్ (మాజీ ప్లేయర్లు), డేనియల్ వెట్టోరి; వీవీఎస్ లక్ష్మణ్ (ప్రస్తుత ప్లేయర్ల డిలిగేట్స్); గ్యారీ స్టెడ్ (సభ్య జట్టు కోచ్ ప్రతినిధి), జై షా (పూర్తి సభ్యుల ప్రతినిధి); జోయెల్ విల్సన్ (అంపైర్ల ప్రతినిధి); రంజన్ మడుగల్లె (ఐసీసీ చీఫ్ రిఫరీ); జామీ కాక్స్ (MCC ప్రతినిధి); కైల్ కోయెట్జర్ (అసోసియేట్ ప్రతినిధి); షాన్ పొల్లాక్ (మీడియా ప్రతినిధి); గ్రెగ్ బార్క్లే, జియోఫ్ అల్లార్డిస్ (Ex Officio - ICC చైర్ పర్సన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్); క్లైవ్ హిచ్‌కాక్ (కమిటీ కార్యదర్శి); డేవిడ్ కెండిక్స్ (గణాంక శాస్త్రవేత్త).

Story first published: Tuesday, September 20, 2022, 12:45 [IST]
Other articles published on Sep 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+