న్యూజిలాండ్ టీమ్ విశ్లేషణ: అందని ద్రాక్ష ఈసారైనా అందేనా?

హైదరాబాద్: జట్టులో పెద్దగా స్టార్లు లేకపోయినప్పటికీ.. సమిష్టి కృషితో ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ల్లో అత్యంత నిలకడగా రాణించిన జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండే. వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సెమీపైనల్స్ అడిన జట్టుగా ఆస్ట్రేలియాతో కలిసి న్యూజిలాండ్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఏడు సార్లు సెమీపైనల్స్‌కు అర్హత సాధించగా.... న్యూజిలాండ్ కూడా ఏడు సెమీఫైనల్స్ ఆడింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటి కానున్నా... ప్రత్యర్ధి జట్ల విజయాలను ప్రభావితం చేయగలదు.

న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన
వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది మాత్రం 2015లోనే. మెక్‌కల్లమ్ నాయకత్వంలోని కివీస్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. గత టోర్నీలో ఆడిన జట్టులో చాలా మంది ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు. టోర్నీలో భాగంగా కివీస్ జట్టు జూన్ 1న శ్రీలంకతో తన ఆరంభమ్యాచ్‌లో తలపడనుంది.

న్యూజిలాండ్ బలాలు
కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ పటిష్టంగానే కనిపిస్తోంది. గ్రాండ్‌హోమ్, శాంట్నర్, నీషమ్‌ల రూపంలో నాణ్యమైన ఆల్‌రౌండర్లు జట్టులో ఉండడం న్యూజిలాండ్ బలం. ఈ ముగ్గురిలో ఇద్దరు తుది జట్టులో తప్పక ఉంటారు. ఇక, జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ఫామ్‌లో ఉన్నాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా కీర్తింపబడుతున్నాడు. జట్టులో మరో కీలక ఆటగాడు రాస్ టేలర్. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ రాస్ టేలర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. అందుకు కారణంగా ఈ మధ్య కాలంలో రాస్ టేలర్ నిలకడగా ఆడుతుండటమే. బలమైన లోయర్ ఆర్డర్ కూడా ఆ జట్టుకు కలిసిరానుంది.

కీలక ఆటగాళ్లు
కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, రాస్ టేలర్, మిచెల్ శాంట్నర్

వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, కోలిన్ మన్రో, హెన్రీ నికోల్స్, ఇష్ సోధి, రాస్ టేలర్, టామ్ బ్లండెల్, గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్తిల్, టామ్ లేథమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ.

న్యూజిలాండ్ బలహీనతలు
కివీస్ స్టార్ బ్యట్స్‌మన్ కొలిన్ మున్రో పేలవ ఫామ్‌లో ఉన్నాడు. నిజానికి అతడు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోడేమో అని అనుకున్నారంతా. అయితే, కివీస్ సెలక్టర్లు అతడిపై విశ్వాసం ఉంచారు. ఓపెనర్లుగా నికోల్స్, మార్టిన్ గప్తిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఎవరో ఒకరు గాయపడితేనే మన్రోకు అవకాశం దక్కుతుంది. స్పిన్నర్లు లేకపోవడం ఈ జట్టులో ప్రధాన బలహీనత. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అప్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లకు మంచి మణికట్టు స్పిన్నర్లు ఉన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications