
అనుమతిచ్చిన ఐసీసీ
ఇందుకోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి శ్రీలంక జట్టు మేనేజ్‌మెంట్ అనుమతి లభించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఐసీసీ సెకండ్ ఛాయిస్ జెర్సీలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. టీమిండియా సైతం జూన్ 30న ఇంగ్లాండ్‌తో తలపడనున్న మ్యాచ్‌లో ఆరెంజ్ కలర్ జెర్సీతో బరిలోకి దిగనుంది.

ఐసీసీ నిబంధనల ప్రకారం
ఈ ప్రపంచకప్‌లో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం మినహాయించి ప్రతి జట్టు రెండు రంగుల కిట్‌ల వివరాల్ని అందజేయాలి. రెండు జట్ల జెర్సీల రంగు ఒకే విధంగా ఉన్నప్పుడు అందులో ఒక జట్టు.. వేరే రంగు జెర్సీని ధరించాలి. ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న ఇంగ్లాండ్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంక దేశాల జెర్సీలు కూడా టీమిండియా ధరించే నీలి రంగు జెర్సీలను పోలి ఉండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పసుపు-నీలి రంగు జెర్సీతో
ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పసుపు-నీలి రంగు జెర్సీని ధరించి ఆడింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో శ్రీలంక ఆటగాళ్లు తర్వాత ఆడే మూడు మ్యాచ్‌ల్లో పసుపు, నీలి రంగు కలిసిన దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రత్యేక విజ్ఞప్తి వల్ల శ్రీలంక ఈ జెర్సీలను ధరించేందుకు అనుమతి ఇస్తున్నామని ఐసీసీ పేర్కొంది.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కూడా కొత్త జెర్సీలతో
మరోవైపు ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కొత్త జెర్సీలతో బరిలోకి దిగాయి. 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ ధరించిన నేవీ బ్లూ కలర్ జెర్సీతో ఈ టోర్నమెంట్ ఆడుతుండగా ఆప్ఘనిస్థాన్ కూడా సరిగ్గా అలాంటి జెర్సీతోనే బరిలోకి దిగుతుండటం విశేషం. శ్రీలంక కూడా ఈ వరల్డ్‌కప్‌లో బ్లూ కలర్ జెర్సీతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
