ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ Head to Head in ODI World Cup
ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియా మరియు పాకిస్థాన్ ఇరు జట్లు ముఖాముఖి పోరులో 11 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈ 11 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా పాకిస్థాన్ జట్టు 4 సార్లు గెలిచింది. వరల్డ్ కప్‌లో ఈ ఇరు జట్ల తలపడిన సందర్భంలో ఆస్ట్రేలియా జట్టు చేసిన అత్యధిక పరుగులు 367 అదే పాకిస్థాన్ జట్టు పోస్టు చేసిన అత్యధిక పరుగులు 305. ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్థాన్ చేసిన అత్యల్ప స్కోరు 132 కాగా ఆస్ట్రేలియా చేసిన అత్యల్ప స్కోరు 133.