వరల్డ్‌కప్: అరంగేట్రంలోనే అరుదైన రికార్డు నెలకొల్పిన చాహల్

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. అందుకు తగ్గట్లే కోహ్లీసేన తన తొలి మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన చేయడంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 144 బంతుల్లో 122 నాటౌట్(13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీకి తోడు చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (4/51) అద్భుత ప్రదర్శన చేయడంతో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో చైనామన్ స్పిన్నర్ చాహల్ తన అరంగేట్ర మ్యాచ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

51 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసిన చాహల్
ఈ మ్యాచ్‌లో చాహల్ 51 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. తద్వారా వరల్డ్‌కప్ అరంగేట్ర మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన రెండో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అరంగేట్ర మ్యాచ్‌లో మహ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు.

షమీ 35 పరుగులిచ్చి నాలుగు వికెట్లు
ఈ మ్యాచ్‌లో షమీ 35 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తాజాగా, సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మిడిల్ ఓవర్లలో చాహల్ సైతం అద్భుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో డసెన్(22), డుప్లెసిస్(38), డేవిడ్ మిల్లర్(31), ఫెలుక్వాయో(34) వికెట్లను పడగొట్టాడు.

భారత విజయంలో చాహల్ పాత్ర ఎంతో కీలకం
అంతేకాదు మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారిన డసెన్, డుప్లెసిస్ జోడిని విడగొట్టడంలో చాహల్ పాత్ర ఎంతో కీలకం. చాహల్ వేసిన 20వ ఓవర్ మొదటి బంతిని రివర్స్ స్వీప్‌కు యత్నించి డసెన్ బౌల్డ్ కాగా, గుగ్లీగా వచ్చిన చివరి బంతి డుప్లెసిస్ వికెట్లను గిరాటేసింది. వీరిద్దరినీ ఒకే ఓవర్‌లో ఔట్ చేయడంతో సఫారీలకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

130కే ఆలౌట్ అవుతుందని అనుకున్నారంతా!
ఆ తర్వాత నిలకడగా ఆడుతున్న డేవిడ్ మిల్లర్ 40 బంతుల్లో 31(1 ఫోర్), ఫెలుక్వాయో 12 ఓవర్ల పైగా నిలిచి 46 పరుగులు జోడించారు. మరోసారి చాహల్ తన స్పిన్ బౌలింగ్‌లో వీరిద్దరినీ ఔట్ చేసి సఫారీ జట్టుని కోలుకోలేని దెబ్బతీశాడు. ఒకానొక దశలో 130కే ఆలౌట్ అవుతుందన్న సఫారీలు 227 పరుగులు చేశారు. చివర్లో క్రిస్ మోరిస్(42), రబాడ(31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.

రోహిత్ శర్మ సెంచరీ
అనంతరం దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న 22 సెంచరీల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications