Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో కీలక మ్యాచ్ సమయంలో పాక్ క్రికెటర్ల భార్యల లొల్లి!

ICC Cricket World Cup 2019 : Mohammad Yousuf Lashes Out At PCB For Allowing Families With Players
ICC Cricket World Cup 2019: Yousuf slams PCB for allowing families to stay with players ahead of India clash

హైదరాబాద్: ప్రపంచకప్‌లో టీమిండియా తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. మాంచెస్టర్ వేదికగా జూన్ 16(ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియా-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ మ్యాచ్‌పై పడింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయితే, ఈ మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్‌ క్రికెటర్ల భార్యాపిల్లల్ని అనుమతించడాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ యూసుఫ్‌ తీవ్రంగా తప్పుపట్టాడు. ఈ సందర్భంగా మహ్మద్‌ యూసుఫ్‌ మాట్లాడుతూ "1999, 2003, 2007 వరల్డ్‌కప్‌ల్లో ఆడాను. టోర్నమెంట్ జరిగే సమయంలో క్రికెటర్ల కుటుంబ సభ్యులను బోర్డు అనుమతించేది కాదు" అని అన్నాడు.

కుటుంబ సభ్యులకు తొలుత అనుమతి నిరాకరణ

కుటుంబ సభ్యులకు తొలుత అనుమతి నిరాకరణ

ఈ ప్రపంచకప్‌లో కూడా క్రికెటర్ల కుటుంబ సభ్యులకు తొలుత అనుమతి నిరాకరించిన పాక్‌ బోర్డు, ఆ తర్వాత ఆ నిబంధనను సడలించింది. దీంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనంతరం క్రికెటర్ల కుటుంబ సభ్యులు ఇంగ్లాండ్‌ చేరుకునేందుకు అంగీకరించింది. భార్యాపిల్లలు ఆటగాళ్లతో కలిసి ఉండడంవల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని అన్నాడు.

క్రికెటర్లు నిరంతరం క్రికెట్‌ గురించే

క్రికెటర్లు నిరంతరం క్రికెట్‌ గురించే

ప్రపంచకప్ మెగా టోర్నీలో క్రికెటర్లు నిరంతరం క్రికెట్‌ గురించే ఆలోచించాల్సివుంటుందని, అందులోనూ భారత్‌తో ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌ ఆడే సమయంలో కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో ఉండడం ఏమాత్రం సమర్థనీయం కాదని యూసుఫ్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

పాక్ బోర్డు విదేశాల్లో జరిగే వన్డే టోర్నీలకు

పాక్ బోర్డు విదేశాల్లో జరిగే వన్డే టోర్నీలకు

పాక్ తరుపున మహ్మద్‌ యూసుఫ్‌ 90 టెస్టులు, 288 వన్డే మ్యాచ్‌లాడాడు. గతంలో పాక్ బోర్డు విదేశాల్లో జరిగే వన్డే టోర్నీలకు కూడా తమ కుటుంబ సభ్యలను అనుమతించేది కాదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా, 1992 నుండి 2015 ప్రపంచకప్‌ వరకు భారత్‌, పాక్‌లు ఆరుసార్లు తలపడగా.. ఆరుసార్లు భారతే విజేతగా నిలిచింది.

టీమిండియా వరుసగా రెండు విజయాలు

టీమిండియా వరుసగా రెండు విజయాలు

టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా గురువారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఏడు పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా... ఐదు పాయింట్లతో భారత్‌ నాలుగోస్థానంలో కొనసాగుతోంది. పాక్‌ నాలుగు మ్యాచ్‌లకు గాను రెండింట ఓడి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

1
43665

{headtohead_cricket_3_5}

Story first published: Saturday, June 15, 2019, 9:55 [IST]
Other articles published on Jun 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+