ప్రపంచకప్.. భారత్‌కు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి సెమీఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా రెండోసారి సెమీఫైనల్ గండాన్ని దాటలేకపోయిన భారత్.. ప్రపంచకప్-2019లో తన ప్రస్థానంను సెమీస్‌తోనే ముగించింది. సెమీఫైనల్లో ఓడిన భారత జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సుమారు రూ.5.47 కోట్లు (0.8 మిలియన్ల డాలర్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనుంది.

భారత్, ఆస్ట్రేలియాకు రూ.5.47 కోట్లు:
ప్రపంచకప్ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 10 మిలియన్ల డాలర్లు. లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు గాను జట్టుకు సుమారు రూ. 27.4 లక్షలు (40 వేల డాలర్లు) చొప్పున అందిస్తారు. మరి ఆఫ్ఘానిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారో ఇప్పటికైతే సమాచారం లేదు. అయితే సెమీస్‌కు చేరిన ప్రతి జట్టుకూ 0.8 మిలియన్ల డాలర్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కుతుందని ఐసీసీ తెలిపింది. దీని ప్రకారం భారత్, ఆస్ట్రేలియా జట్లకు రూ.5.47 కోట్లు ప్రైజ్ మనీగా లభించనుంది.

విజేతకు 4 మిలియన్ల డాలర్లు:
లార్డ్స్ మైదానంలో జూలై 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు విశ్వ విజేతగా నిలుస్తుంది. ప్రపంచకప్ విజేతకు 4 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ. 27.38 కోట్లు ప్రైజ్ మనీగా లభించనుంది. రన్నరప్‌కు 2 మిలియన్ల డాలర్లు అంటే సుమారు రూ.13.7 కోట్లు లభిస్తుంది. ప్రపంచకప్ గెలిచిన జట్టు ప్రైజ్‌మనీతో పాటు బంగారు ట్రోఫీ కూడా అందుకుంటుంది. ఈసారి జరిగే ప్రపంచకప్ చరిత్రలో నిలువనుంది. ఎందుకంటే ఇది అన్ని ప్రపంచకప్‌లోకెల్లా అత్యధిక ప్రైజ్ మనీ.

చివరి మ్యాచ్:
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను ఐసీసీ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోంది. ఈ వన్డే ప్రపంచకప్‌కు యునైటెడ్ కింగ్‌డమ్ ఆతిథ్యమివ్వడం ఆరోసారి. మొత్తం 10 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ప్రపంచకప్ టోర్నీ 46 రోజుల పాటు జరుగుతుంది, ఆదివారంతో టోర్నీ ముగియనుంది. ఇంగ్లండ్‌లోని 11 మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరిగాయి. మే 30వ తేదీన తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగింది. చివరి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications