Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌.. అంపైర్‌కి బౌలర్ షెల్డోన్ కాట్రేల్ సెల్యూట్

ICC Cricket World Cup 2019: Windies Bowler Sheldon Cottrell salute to Filed Umpire Over wicket Celebrations

వికెట్ పడగొట్టిన ప్రతి బౌలర్ తనదైన స్టయిల్లో సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్లు ప్రత్యేక సంబరాలు చేసుకుంటారు. డ్వేన్ బ్రేవో ఒక్కోసారి మైదానం మొత్తం పరుగెత్తుతూ, మరోసారి డాన్స్ చేస్తూ వికెట్ సంబరాలు చేసుకుంటాడు. ఇక ప్రొటీస్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మైదానంలో పరుగెత్తుతూ సహచర ఆటగాళ్లకు దొరకకుండా సంబరాలు చేసుకుంటాడు. తాహిర్ సంబరాలను మనం ఐపీఎల్-12, ప్రపంచకప్‌ తొలి మ్యాచులో చూసాం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తాజాగా విండీస్ బౌలర్ షెల్డోన్ కాట్రేల్ అంపైర్‌కి సెల్యూట్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ట్రెంట్‌ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో షెల్డోన్ ఈ సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచులో మూడో ఓవర్ చివరి బంతిని షెల్డోన్ వేయగా.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఫైన్‌లెగ్ దిశగా షాట్ ఆడాడు. బంతి ఇమామ్ గ్లౌవ్స్‌ను తాకి వికెట్ కీపర్ షై హోప్ చేతిలో పడింది. వెంటనే ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీంతో అంపైర్‌కి సెల్యూట్‌ కొట్టిన షెల్డోన్.. ఆ తర్వాత సహచర ఆటగాళ్లతో సంబరాలు చేసుకున్నాడు.

1
43646

దీనికి సంబందించిన వీడియోను క్రికెట్ వరల్డ్ కప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. పాకిస్థాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ పేస్‌ బౌలర్లు ఒషేన్‌ థామస్‌ (4/27), జేసన్‌ హోల్డర్‌ (3/42), రసెల్‌ (2/4)ల ధాటికి విలవిల్లాడిన పాకిస్థాన్‌.. 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఫకర్‌ జమాన్‌ (22), బాబర్‌ అజామ్‌ (22) టాప్‌ స్కోరర్లు. స్వల్ప లక్ష్యాన్ని వెస్టిండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. గేల్‌ (50; 34 బంతుల్లో 6×4, 3×6) మెరుపు అర్ధ శతకం చేసాడు. నికోలస్‌ పూరన్‌ 34 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Story first published: Saturday, June 1, 2019, 16:08 [IST]
Other articles published on Jun 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+