
హైదరాబాద్: వరల్డ్‌కప్ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం వెస్టిండిస్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండిస్ కెప్టెన్ పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టాస్ అనంతరం విండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మాట్లాడుతూ ఎవిన్ లూయిస్, షానన్ గాబ్రియెల్ ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్‌కు దూరమైనట్లు చెప్పాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వెస్టిండిస్ జట్టులో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్‌లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పాకిస్థాన్‌పై రస్సెల్‌కు మంచి రికార్డు ఉండటం కలిసొచ్చే అంశం. 2015 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది.
వరల్డ్‌కప్‌కు ముందు పాక్ ఆడిన 11 వన్డేల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. అయితే, ఇదే గడ్డపై 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన స్ఫూర్తితోనే పాక్ బరిలోకి దిగుతోంది. పాక్ సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. పేసర్ మహ్మద్ ఆమీర్ ఫిట్‌నెస్ సాధించాడు.
పాకిస్థాన్ బాబర్ అజామ్, ఫకర్ జమాన్, షోయబ్ మాలిక్‌లపైనే ఆశలు పెట్టుకుంది. వరల్డ్‌కప్ టోర్నీల్లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 10 మ్యాచ్‌ల్లో తలపడగా వెస్టిండిస్ ఏడింట విజయం సాధించగా.. పాక్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. మొత్తంగా చూస్తే పాకిస్తాన్‌పై వెస్టిండీస్‌దే పైచేయిగా ఉంది.
{headtohead_cricket_5_8}
ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆరోస్థానంలో కొనసాగుతుండగా, వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరి నేటి మ్యాచ్‌లో ఎవరి భవితవ్యం ఏమిటో వేచి చూడాల్సిందే.
జట్ల వివరాలు:
పాకిస్థాన్: ఇమామ్ ఉల్ హక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్, హారిస్ సోహైల్, మహ్మద్ హఫీజ్, సర్ఫరాజ్ అహ్మద్(వికెట్ కీపర్, కెప్టెన్), ఇమాద్ వాసమ్, షాదబ్ ఖాన్, హాసన్ అలీ, వాహబ్ రియాజ్, మహ్మద్ ఆమీర్
వెస్టిండిస్: క్రిస్ గేల్, షాయ్ హోప్, డారెన్ బ్రావో, షిమ్రన్ హెట్‌మెయిర్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్(కెప్టెన్), కార్లోస్ బ్రాత్ వైట్, ఆష్లే నర్స్, షెల్డన్ కోట్రల్, ఒషానే థామస్