For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

105కే ఆలౌట్: వరల్డ్‌కప్‌లో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసిన పాక్

ICC Cricket World Cup 2019, WI vs Pak LIVE Score: Thomas, Holder shine as Pakistan post 105 runs on board

హైదరాబాద్: నాటింగ్‌ హామ్‌ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ విండిస్ బౌలర్ల దెబ్బకు 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. తద్వారా వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుని నమోదు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పాకిస్థాన్ ఏ దశలోనే విండీస్‌ పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోలేకపోయింది. పాకిస్థాన్ జట్టులో ఫకర్‌ జమాన్‌ (22), బాబర్ ఆజామ్‌ (22) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఇమాముల్‌ హక్‌(2) పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

1
43645

దీంతో జట్టు స్కోరు 17 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్‌ జమాన్‌(22), హరీస్‌ సోహైల్‌(8), బాబర్‌ అజమ్‌(22), సర్పరాజ్‌ అహ్మద్‌(8) వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. విండీస్‌ బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొవడంలో విఫలమయ్యారు.

చివర్లో వాహబ్‌ రియాజ్‌ 11 బంతుల్లో 18 (1 ఫోర్‌, 2 సిక్సర్లు) ఫరవాలేదనిపించడంతో పాకిస్థాన్ కనీసం వంద పరుగుల మార్కుని సైతం అందుకోగలిగింది. వెస్టిండిస్ జట్టులో ఒషాన్‌ థామస్‌ నాలుగు వికెట్లు తీయగా జాసన్‌ హోల్డర్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. ఆండ్రీ రసెల్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

{headtohead_cricket_5_8}

Story first published: Friday, May 31, 2019, 17:20 [IST]
Other articles published on May 31, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+