బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్ విజేత! మరి అవి కూడా సమం అయితే?

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన 2019 ప్రపంచకప్ విజేత ఎవరో తెలిసిపోయింది. ఆదివారం లార్డ్స్ వేదికగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 45 రోజుల పాటు జరిగిన ఈ మెగా టోర్నీకి లండన్ వ్యాప్తంగా మొత్తం 11 వేదికలు ఆతిథ్యమిచ్చాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
లార్డ్స్ వేదికాగ జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ విజయం సాధించి 44 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలవాలన్న కలను నెరవేర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.

ప్రధాన మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్
దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. ఇది సగటు క్రికెట్ అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసింది.

బౌండరీలు ఆధారంగా మ్యాచ్ ఫలితం
చివరకు బౌండరీలు ఆధారంగా మ్యాచ్ ఫలితం తేల్చింది. ఫైనల్లో ఇంగ్లాండ్ సూపర్ ఓవర్‌తో కలుపుకొని 26 బౌండరీలు బాదగా న్యూజిలాండ్ మాత్రం 17 బౌండరీలే సాధించింది. దీంతో ఇంగ్లాండ్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ టై అయితే ప్రధానమ్యాచ్, సూపర్ ఓవర్ మొత్తం బౌండరీలు లెక్కించి.. ఎక్కవ బౌండరీలు చేసిన జట్టును విజేతగా ప్రకటించారు.

బౌండరీలు కూడా సమం అయితే
దీంతో ఈ ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌లన్నీ ఒక ఎత్తు అయితే, ఫైనల్ మ్యాచ్ మరో ఎత్తు. అందుకు కారణం ఫైనల్ మ్యాచ్ టై కావడంతో పాటు ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ సైతం టై కావడమే. విజేతను ప్రకటించే క్రమంలో బౌండరీలు కూడా సమం అయితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతి అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న.

సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం
అయితే సూపర్ ఓవర్ నిబంధనల ప్రకారం ఇదే పరిస్థితి ఏర్పడితే.. కేవలం ప్రధాన మ్యాచ్ బౌండరీలను మాత్రమే లెక్కిస్తారు. ఒకవేళ అవి కూడా సమానమైతే.. సూపర్ ఓవర్ చివరి బంతి నుంచి ఇరు జట్లు సాధించిన పరుగులను పరిగణలోకి తీసుకొని ఎక్కువ పరుగులు చేసిన జట్టుని విజేతగా ప్రకటిస్తారన్నమాట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications