1983 ప్రపంచకప్.. రివార్డు ఎలా ఇచ్చారంటే

ప్రస్తుతం బీసీసీఐ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డు. వరుస సిరీస్‌లు, ఐపీఎల్ వంటి వాటితో బీసీసీఐకి బాగానే రాబడి ఉంది. ఐసీసీని సైతం శాషించే శక్తి బీసీసీఐకి ఉంది. అయితే ఒకప్పుడు మాత్రం బీసీసీఐ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. 1983 ప్రపంచకప్ గెలిచినప్పుడు కపిల్ సారథ్యంలోని జట్టుకు నజరానా ఇవ్వడానికి కూడా బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

లతా మంగేష్కర్ సాయంతో రివార్డు:
దీంతో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వే.. సింగర్ లతా మంగేష్కర్ సాయం కోరారు. ఆమెతో ఢిల్లీలో ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించగా.. టిక్కెట్ల ద్వారా రూ. రెండు లక్షలు వచ్చాయి. ఆ డబ్బును విశ్వవిజేత టీమిండియాకు బీసీసీఐ రివార్డుగా ఇచ్చి సత్కరించింది.

జాతీయ సెలవు దినం:
భారత్ 1983లో విశ్వవిజేతగా నిలవడంతో.. ఆటగాళ్ల కృషికి గుర్తుగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫైనల్ తర్వాతి రోజు (జూన్ 26న)న జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. 1983 ప్రపంచకప్‌పై పెద్దగా ఆశలు పెట్టుకొని భారత ఆటగాళ్లు అమెరికా పర్యటనకు ప్లాన్ వేసుకున్నారు. ఇక గ్రూపు దశలో వెనుదిరిగితే అక్కడ కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాలని కూడా ప్లాన్ వేసుకున్నారట. అనూహ్యంగా ఫైనల్ చేరడంతో వారి ప్లానులు అన్ని తలక్రిందులయ్యాయి.

భారత్ జయకేతనం:
లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. విండీస్ బౌలర్ల ధాటికి భారత ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరి కేవలం 183 పరుగులు మాత్రమే చేశారు. శ్రీకాంత్ (38), అమర్నాథ్ (26)లు పర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో విండీస్ కూడా త్వరగానే వికెట్లు కోల్పోయింది. వివిఎన్ రిచర్డ్స్ (33) పోరాడాడు. అయితే కపిల్‌దేవ్, మదన్‌లాల్, అమర్‌నాథ్‌లు చెలరేగడంతో విండీస్ 140 పరుగులకే ఆలౌట్ అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications