'మ్యాచ్‌లో ఏదైనా కానీ మాకు ధోనీ కావాలి'

మ్యాచ్‌లో ఏదైనా కానీ మాకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కావాలి. మేమింకా ధోనీ చెప్పే మాటలను వింటాం. మేం ఏ నిర్ణయం తీసుకున్నా.. ధోనీ సలహాలు తీసుకుంటాం అని టీమిండియా స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ తెలిపారు. తాజాగా చాహల్ ఓ మీడియాతో మాట్లాడుతూ ధోనీ, కుల్దీప్, ప్రపంచకప్‌పై తన అభిప్రాయాలను వెల్లడించాడు.

ధోనీ చెప్పే మాటలను వింటాం:
ధోనీ గురించి మాట్లాడుతూ.. మ్యాచ్‌లో ఏదైనా కానీ మాకు ధోనీ కావాలి. మేమింకా ధోనీ చెప్పే మాటలను వింటాం. మ్యాచ్‌లో మేం తప్పు చేస్తే తనే మాతో మాట్లాడతాడు. బ్యాట్స్‌మన్‌ను బట్టి ఎలా బౌలింగ్ చేయాలో చెపుతాడు. అతని సలహాలు ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ మేం ఏదైనా నిర్ణయం తీసుకున్నా.. కచ్చితంగా ధోనీ సలహాలు తీసుకుంటాం' అని చాహల్ తెలిపారు.

ఒకరికొకరం అండగా ఉంటాం :
గత కొంత కాలంగా చాహల్, కుల్‌దీప్ యాదవ్‌లు టీమిండియా తరపున సత్తా చాటుతున్నారు. కుల్‌దీప్ గురుంచి మాట్లాడుతూ... 'గత కొంత కాలంగా ఇద్దరం మంచి ప్రదర్శనే చేశాం. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఒకరికొకరం అండగా ఉంటాం. పిచ్ పరిస్థితులకు తగ్గట్టు చర్చించి బౌలింగ్ వేస్తాం. తను నాకు సోదరుడిలాంటివాడు. మనం రాణించని సమయంలో మనతో మాట్లాడేవాళ్లు ఉండాలి. ఒకవేళ జట్టుతో లేకపోతే మేం వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తాం. అలా కలిసుండటం చాలా మంచిది' అని చాహల్ పేర్కొన్నాడు.

వారి స్థానాల్లో మాకు అవకాశం వచ్చింది
మిగతా జట్ల లైవ్ మ్యాచులను ఎక్కువగా చూడను. హైలెట్స్ చూస్తాను. దీంతో బ్యాట్స్‌మన్ ఎలా ఆడుతున్నారో తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా ఏదైనా బ్యాట్స్‌మన్ గురించి తెలుసుకోవాలంటే వీడియో అనలైజ్ చూస్తాను. జట్టులో ఎప్పటికి నేను, కుల్దీప్ ఉంటామని చెప్పలేం. హార్దిక్, జడేజా, నేను ఎవరు ఉన్నా లేకున్నా మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ నాకు జతగా జడేజా ఉంటే అతనితో చర్చిస్తా. అతను కూడా సలహాలు ఇస్తాడు. అతని అనుభవం నాకు ఉపయోగపడుతుంది. అశ్విన్, జడేజా స్థానాల్లో మాకు అవకాశం వచ్చింది. దాన్ని అందిపుచ్చుకున్నాం. వారితో మాకు పోలిక వద్దు' అని చాహల్ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications