Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విండిస్‌పై టీమిండియా బ్యాటింగ్: డగౌట్‌కే పరిమితమైన భువీ

ICC Cricket World Cup 2019 : West Indies V India || India Have Won The Toss And Have Opted To Bat
ICC Cricket World Cup 2019: West Indies vs India: India have won the toss and have opted to bat

మాంచెస్టర్‌ వేదికగా మరోకొద్ది సేపట్లో వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఎలాంటి మార్పు చేయలేదు. స్టార్ పేసర్ భువీకి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు విండీస్ రెండు మార్పులు చేసింది. అంబ్రీస్, అలెన్ జట్టులోకి వచ్చారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌లపై గెలిచి భారత్.. సెమీస్‌ దిశగా అడుగులేస్తుస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ బెర్తును చేరువవ్వాలని భారత్ భావిస్తోంది. టోర్నీలో ఇప్పటి వరకు ఒకే మ్యాచ్‌ గెలిచింది విండీస్‌. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిస్తే తప్ప సెమీస్ ఆశలు పెట్టుకోలేని స్థితిలో ఉంది. విండీస్ తమదైన రోజున చెలరేగితే విజయం సులువే.

ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. పిచ్‌ పొడిగా ఉండడంతో మ్యాచ్‌ సాగేకొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపగలరు. టోర్నీలో ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలుపొందింది. భారత్‌ ఇదే వేదికపై ఇప్పటికే పాక్‌తో ఆడగా.. విండీస్‌ కూడా న్యూజిలాండ్‌ను ఇక్కడే ఎదుర్కొంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.

1
43677

భారత్, వెస్టిండీస్‌ జట్లు ఇప్పటివరకు 126 వన్డేల్లో తలపడ్డాయి. 59 మ్యాచ్‌ల్లో భారత్‌, 62 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌ గెలుపొందాయి. రెండు మ్యాచ్‌లు 'టై'గా ముగిశాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో రెండు జట్లు ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఐదు మ్యాచ్‌ల్లో భారత్.. మూడు మ్యాచ్‌ల్లో విండీస్‌ గెలిచాయి. ప్రపంచకప్‌లో చివరిసారి 1992లో భారత్‌పై విండీస్‌ గెలిచింది. అనంతరం 1996, 2011, 2015 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ను విజయం సాధించింది.

{headtohead_cricket_3_8}

జట్లు:

భారత్‌: కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), విజయ్‌ శంకర్‌, ఎంఎస్ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

వెస్టిండీస్‌: క్రిస్‌ గేల్‌, సునిల్‌ ఆంబ్రిస్‌, షాయ్‌ హోప్‌ (వికెట్‌ కీపర్‌), నికోలస్ పూరన్‌, హెట్‌మయెర్‌, కార్లోస్ బ్రాత్‌వైట్‌, జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌), ఫాబియాన్ అలెన్, కీమర్ రోచ్‌, కార్టెల్‌, ఒషానె థామస్‌.

Story first published: Thursday, June 27, 2019, 14:50 [IST]
Other articles published on Jun 27, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+