న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో మ్యాచ్‌.. షకిబ్‌ అల్‌ హసన్‌ అరుదైన రికార్డు

ICC Cricket World Cup 2019 : Shakib Al Hasan Completes 6,000 ODI Runs !| Oneindia Telugu
ICC Cricket World Cup 2019, West Indies vs Bangladesh: Shakib Al Hasan reaches landmark 6k ODI runs & 250 wickets

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ అరుదైన రికార్డును అందుకున్నాడు. వన్డేల్లో ఆరు వేల పరుగులను షకిబ్‌ పూర్తి చేసాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద.. 15వ ఓవర్లో ఒషానే థామస్ వేసిన బంతికి సింగిల్ తీసి షకిబ్‌ ఈ మైలురాయిని చేరుకున్నాడు. బంగ్లా తరపున తమీమ్ ఇక్బాల్ (6743) షకిబ్‌ కంటే ముందున్నాడు. షకిబ్‌ తర్వాతి స్థానంలో రహీం (5700) ఉన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వన్డేల్లో ఆరువేల పరుగులతో పాటు 250 వికెట్లు పడగొట్టిన నాలుగో ఆటగాడిగా కూడా షకిబ్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ సనత్‌జయసూర్య, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలీస్‌, పాకిస్థానీ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీలు షకిబ్‌ కంటే ముందున్నారు. ఈ మ్యాచ్‌లో షకిబ్ (124 నాటౌట్‌; 99 బంతుల్లో 16×4) అజేయ సెంచరీ చేసి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజా సెంచరీతో ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా షకిబ్‌ (384) నిలిచాడు. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (343) రెండో స్థానంలో ఉన్నాడు.

మ్యాచ్ అనంతరం షకిబ్‌ మాట్లాడుతూ... 'గత నెలన్నర రోజులుగా రోజులుగా బ్యాటింగ్‌పై దృష్టి పెట్టా. నెట్స్ లో చాలా శ్రమించా. అందుకు తగ్గ ఫలితం వచ్చింది. జట్టు విజయంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది. చివరి వరకూ క్రీజులో ఉండడం ఆత్మవిశ్వాసంను పెంచింది. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగడం మంచి అవకాశం. మధ్య ఓవర్లలో ఎక్కువసేపు ఆడేందుకు వీలుంటుంది. తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక బ్యాటింగ్‌ బాగా చేస్తే విజయం సులువే అని అనుకున్నాం. మా ప్రణాళికలను అమలు చేసాం. వెస్టిండీస్‌ కూడా బాగా ఆడింది. విండీస్ భారీ టార్గెట్ నిర్దేశించింది. కానీ మేము వారికంటే బాగా ఆడాం' అని షకిబ్‌ అన్నాడు.

షకిబ్‌కు ఐపీఎల్-12లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున పెద్దగా ఆడే అవకాశం దక్కలేదు. రెండు మూడు మ్యాచులలో అవకాశం దక్కినా రాణించలేదు. ప్రపంచకప్‌ నేపథ్యంలో బంగ్లా మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు టోర్నీ చివరలో ఐపీఎల్ వీడి స్వదేశానికి వెళ్ళిపోయాడు. అనంతరం ప్రపంచకప్‌లో దుమ్ములేపుతున్నాడు. ఈ టోర్నీలో బంగ్లా ఐదు మ్యాచులు ఆడగా.. శ్రీలంకతో మ్యాచ్ వర్షార్పణం అయింది. మిగిలిన నాలుగు మ్యాచులలో 75, 64, 121, 124 పరుగులు చేసాడు. విండీస్ మ్యాచులో 2 వికెట్లతో పాటు సెంచరీ చేసిన షకిబ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. షకిబ్‌ ఇప్పటికీ రెండు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు అందుకున్నాడు.

Story first published: Tuesday, June 18, 2019, 16:17 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X