Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ 2019లో 105 మీటర్ల భారీ సిక్స‌ర్‌.. ఎవరు బాదారంటే!!

ICC Cricket World Cup 2019 : West Indies Have Hit The 3 Bggest Sixes In World Cup 2019
ICC Cricket World Cup 2019, West Indies vs Bangladesh: Jason Holder smash big six 105 meters in CWC 2019

ప్రపంచకప్‌ 2019లో సోమవారం భారీ సిక్సర్ నమోదయింది. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డ‌ర్ 105 మీటర్ల భారీ సిక్స‌ర్‌ బాదేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం టాంటాన్‌ మైదానంలో బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ భారీ సిక్సర్ నమోదయింది. నికోల‌స్ పూర‌న్, హిట్‌మేయ‌ర్ కూడా భారీ సిక్స్‌తో ఆక‌ట్టుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

విండీస్ ఇన్నింగ్స్ 43వ ఓవర్‌ను బంగ్లా కెప్టెన్ మోర్తజా వేసాడు. ఆ ఓవర్‌ మూడో బంతిని హోల్డ‌ర్ బలంగా బాదడంతో స్టాండ్స్ లోకి వెళ్లి పడింది. ఆ సిక్సర్ 105 మీటర్లు వెళ్ళింది. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో ఇదే భారీ సిక్స‌ర్‌. విండీస్ యువ ఆటగాడు నికోల‌స్ పూర‌న్ కూడా ఓ భారీ సిక్స‌ర్‌ (103) కొట్టగా.. స్టాండ్స్ పైక‌ప్పు పెంక ప‌గిలింది. మ‌రో హిట్ట‌ర్ హిట్‌మేయ‌ర్ కూడా భారీ సిక్స్‌ (104)తో ఆక‌ట్టుకున్నాడు. ఈ రెండు సిక్స‌ర్‌లు కూడా 100 మీటర్లు దాటడం విశేషం. దీంతో విండీస్ బ్యాట్స్‌మన్‌ తమ సత్తా చూపారు.

ఈ మ్యాచ్ చేజింగ్‌లో బంగ్లా ప్లేయ‌ర్లు కూడా అదరగొట్టారు. లింట‌న్ దాస్ షార్ట్ పిచ్ బంతుల‌ను సిక్స‌ర్లుగా మలిచాడు. విండీస్ పేసర్ గ్యాబ్రియ‌ల్ వేసిన బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో విరుచుకుపడ్డాడు. సౌమ్యా సర్కార్ కూడా రెండు సిక్స‌ర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 సిక్స‌ర్లు నమోదయ్యాయి. ఈ భారీ సిక్స‌ర్ల వీడియోని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. హోల్డర్, హిట్‌మేయ‌ర్, దాస్ సిక్సర్లతో మీ ఫేవరేట్ ఏది అని పోల్ కూడా పెట్టింది. షకీబ్ అజేయ సెంచరీ చేయడంతో.. 322 ప‌రుగుల భారీ టార్గెట్‌ను బంగ్లా సునాయంగా ఛేదించింది.

Story first published: Tuesday, June 18, 2019, 13:06 [IST]
Other articles published on Jun 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+