వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా ఢీ.. ఆసీస్‌కు స్టీవ్ వా హెచ్చరిక

వెస్టిండీస్ జట్టుతో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడాలని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా హెచ్చరించాడు. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా ఢీ కొట్టనుంది. విండీస్ జట్టులో భారీ హిట్టర్లతో పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న నేపథ్యంలో స్టీవ్ వా పై వ్యాఖ్యలు చేసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఫామ్‌లో గేల్:
ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ప్రపంచకప్‌లోని తొలి మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించాయి. అఫ్గానిస్థాన్‌పై ఆసీస్ విజయం సాధించగా.. విండీస్ పాక్‌ను చిత్తుగా ఓడించి బోణీ కొట్టింది. క్రిస్‌గేల్ 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి మంచి ఊపులో ఉన్నాడు. గేల్ మాత్రమే కాదు.. హాప్, పూరన్, రసెల్, హోల్డర్, బ్రాత్ వైట్ లాంటి భారీ హిట్టర్లు జట్టులో ఉన్నారు. వీరు ఒంటిచేత్తో మ్యాచును మలుపుతిప్పగలరు. ఈ నేపథ్యంలోనే స్టీవ్ వా ఆసీస్‌ను హెచ్చరించాడు.

అందరూ మ్యాచ్ విన్నర్లే:
తాజాగా స్టీవ్ వా మాట్లాడుతూ... 'వెస్టిండీస్‌కు పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంది. ప్రస్తుతం ఆ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లే. ఎటువంటి బౌలింగ్‌లోనైనా పరుగులు చేయగలరు. బ్యాటింగ్ విభాగం పుంజుకుంటే ఎంత పెద్ద మైదానాలైనా సరిపోవు. ప్రత్యర్థుల నుండి ఒక్కసారిగా మ్యాచును తమవైపు లాగేసుకోగలరు' అని వా పేర్కొన్నాడు.

ఆసీస్ జాగ్రత్త:
'చాలా ఏళ్ల తరువాత విండీస్ పేస్ విభాగం బాగుంది. రసెల్, కాట్రేల్, హోల్డర్ ఇప్పటికే నిరూపించుకున్నారు. ప్రతి జట్టు వారితో ఆడాలంటే భయపడుతోంది. వారితో నాకౌట్ మ్యాచ్‌లో తలపడడం నాకిష్టం లేదు. కరీబియన్లు పుంజుకుంటే ట్రోఫీ గెలవగలరు. ఆసీస్‌కు అసలు సిసలు పరీక్ష ముందు ఉంది. విండీస్ జట్టును జాగ్రత్తగా గమనించాలి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడాలి. అన్ని విభాగాల్లో రాణిస్తేనే విజయం దక్కుతుంది' అని స్టీవ్ వా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications