Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఓటమే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది: సర్ఫరాజ్‌

ICC Cricket World Cup 2019 : PAK vs BAN : Sarfaraz Ahmed Post Match Press Conference || Oneindia
ICC Cricket World Cup 2019: West Indies Match cost us the whole tournament says Sarfaraz Ahmed

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రారంభ మ్యాచే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది అని పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్నాడు. అనంతరం పాక్ అద్భుత ప్రదర్శన కనబర్చినా అదృష్టం కలిసిరాలేదని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాక్ 94 పరుగులతో విజయం సాధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అద్భుతంగా ఆడాం కానీ:

అద్భుతంగా ఆడాం కానీ:

మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'గత నాలుగు మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తు మేం సెమీస్‌ చేరుకోలేదు. వెస్టీండీస్‌తో జరిగిన ప్రారంభ మ్యాచే టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. భారత్‌తో ఓటమి ఆనంతరం మా జట్టు బాగా పుంజుకుంది. ఆరంభంలో జట్టు కూర్పు కూడా బాగాలేదు. షాహిన్‌ ఆఫ్రిది, హారీస్‌ సోహైల్‌ వచ్చిన తర్వాత జట్టు బలపడింది. ఇప్పుడు జట్టు సమతూకంగా ఉంది' అని సర్ఫరాజ్‌ తెలిపాడు.

షాహిన్‌ బౌలింగ్‌ అద్భుతం:

షాహిన్‌ బౌలింగ్‌ అద్భుతం:

'గత రెండు నెలలు చాలా కష్టపడ్డాం. మా బ్యాట్స్‌మెన్‌ ఇమామ్‌, బాబర్‌, హ్యారిస్‌, బౌలర్ల ప్రదర్శన బాగుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌ మాకు మరింత ప్రోత్సాహంగా నిలిచింది. ఈ రోజైతే మరింత ముఖ్యం. ఆరు వికెట్లు పడగొట్టాడు. మంచి బౌలర్ దొరికాడు. ఇక మా ఆటపై చర్చిస్తాం. లోపాలు గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. టోర్నీ ఆసాంతం మద్దతు పలికిన అభిమానులకు ధన్యవాదాలు' అని సర్ఫరాజ్‌ తెలిపాడు..

విండీస్‌ మ్యాచే:

విండీస్‌ మ్యాచే:

పాక్ ప్రారంభ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఓడిపోగా.. చివరి మ్యాచ్‌లో బంగ్లాపై విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ 5 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దవడంతో 11 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండడంతో సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. విండీస్‌తో మ్యాచ్‌లో పాక్‌ 105 పరుగులకే ఆలౌట్ అవగా.. విండీస్‌ 13.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఇదే పాక్‌ జట్టు రన్‌రేట్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

Story first published: Saturday, July 6, 2019, 13:52 [IST]
Other articles published on Jul 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+