For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌కు షాక్.. ప్రపంచకప్‌ నుంచి రసెల్‌ ఔట్‌

ICC Cricket World Cup 2019 : West Indies All Rounder Russell Ruled Out From World Cup 2019
ICC Cricket World Cup 2019: West Indies All Rounder Andre Russell ruled out for the rest of the tournament due to injury

భారత్‌తో మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్‌కు జట్టుకు భారీ షాక్ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ ప్రపంచకప్‌ నుంచి వైదొలిగాడు. రసెల్‌ టోర్నీ నుంచి తప్పుకున్న విషయాన్ని విండీస్‌ మేనేజ్‌మెంట్‌ స్పష్టం చేసింది. కీలక సెమీస్‌ మ్యాచ్‌లకు ముందు రసెల్‌ టోర్నీ నుండి తప్పుకోవడంతో విండీస్ ఆందోళనలో ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌ ఆరంభమైన నాటి నుంచి మోకాలి గాయంతో బాధపడుతున్న రసెల్‌ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. ఈ టోర్నీలో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రసెల్‌.. 36 పరుగులు చేసి ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. అతడి స్థానంలో సునీల్‌ ఆంబ్రోస్‌ జట్టులోకి వస్తాడని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్‌లో అదరగొట్టిన రస్సెల్‌.. ప్రపంచకప్‌లో మాత్రం తేలిపోయాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తనదైన ముద్ర వేయలేదు. కీలక మ్యాచ్‌లలో కూడా రసెల్‌ చేతులెత్తేశాడు.

ఈ మెగా టోర్నీలో విండీస్‌ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక మ్యాచ్‌ మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. ప్రస్తుతం విండీస్‌ ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఆ జట్టు సెమీస్‌ అవకాశాలపై ఆశలు పెట్టుకోవాలంటే అన్నీ గెలవాలి. ఈ తరుణంలో రసెల్‌ జట్టుకు దూరం కావడం విండీస్‌కు ఎదురుదెబ్బే.

Story first published: Tuesday, June 25, 2019, 7:47 [IST]
Other articles published on Jun 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+