న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రాక్టీస్ మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘనవిజయం

ICC World Cup 2019: Warm-Up Match Highlights | India Beat Bangladesh By 95 Runs!!
ICC Cricket World Cup 2019: Warm-up game: Dhoni, Rahul headline Indias comfortable win

మెగా టోర్నీ ప్రారంభానికి ముందు భారత్ సమిష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. భారత్‌ 95 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా.. రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పుంజుకుంది. ఓపెనర్లు విఫలమైనా.. కెప్టెన్‌ కోహ్లీ, రాహుల్, ధోనీలు చెలరేగారు. ముఖ్యంగా రాహుల్, ధోనీలు సరైన సమయంలో శతకాలు సాధించి భారీ స్కోర్ అందించారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్, చహల్‌లు బంగ్లా పనిపెట్టారు. ఈ మ్యాచ్‌తో నాలుగో స్థానంలో రాహుల్‌ను దింపడమే సరైన నిర్ణయం అని కూడా తెలిసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆదుకున్న ముష్ఫికర్‌:

ఆదుకున్న ముష్ఫికర్‌:

360 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు లిటన్‌ దాస్‌ (73), సౌమ్య సర్కార్‌ (25)లు ఇన్నింగ్స్‌ను నడిపించారు. భారత పేసర్లు బుమ్రా, షమీలను సమర్థంగా ఎదుర్కొంటూ 49 పరుగులు జోడించారు. బుమ్రా వేసిన పదో ఓవర్లో కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి సౌమ్య ఔటయ్యాడు. ఆ తర్వాతి బంతికే షకీబ్‌ (0) పెవిలియన్ చేరాడు. ఈ దశలో లిటన్.. ముష్ఫికర్‌ (90)తో కలిసి బ్యాటింగ్‌ చేసాడు. ఈ జోడి 130 బంతుల్లో 120 పరుగులు జత చేశారు.

95 పరుగులకే 8 వికెట్లు:

95 పరుగులకే 8 వికెట్లు:

స్పిన్నర్ చహల్‌ వరుస బంతుల్లో లిటన్, మిథున్‌ (0)లను పెవిలియన్‌ చేర్చాడు. తొలుత మొహ్మదుల్లా (9)ను బౌల్డ్‌ చేసిన కుల్దీప్‌.. ముష్ఫికర్, హొస్సేన్‌ (0)లను అవుట్ చేసాడు. హాసన్ కూడా రనౌట్ అవ్వడంతో.. బంగ్లాదేశ్‌ 49.3 ఓవర్లలో 264 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా 95 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్, చాహల్ తలో మూడు వికెట్లు తీశారు.

 ఓపెనర్లు విఫలం:

ఓపెనర్లు విఫలం:

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 7 వికెట్లకు 359 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ (19), ధావన్‌ (1) మరోసారి నిరాశపరిచారు. కోహ్లీ (47; 46 బంతుల్లో 5×4) రాహుల్‌తో మూడో వికెట్‌కు 33 పరుగులు జోడించి నిష్క్రమించాడు. కాసేపటికే విజయ్‌ శంకర్‌ (2) కూడా ఔటవడంతో భారత్‌ 22 ఓవర్లలో 102/4తో కష్టాల్లో పడింది. అయితే నాలుగో స్థానంలో వచ్చిన రాహుల్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

శతకాల జోరు:

శతకాల జోరు:

మొదటగా నెమ్మదిగా ఆడిన ధోనీ.. గేర్ మార్చి క్రమంగా చెలరేగిపోయాడు. బౌండరీలతో అలరించాడు. ఈ జోడి దాటికి టీమిండియా స్కోర్ 250 దాటింది. 94 బంతుల్లో శతకం (108; 99 బంతుల్లో 12×4, 4×6) పూర్తి చేసుకున్న రాహుల్‌.. కాసేపటికే అవుట్ అయ్యాడు. ఈ దశలో ధోనీ మరింత విధ్వంసం సృష్టించాడు. జయేద్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది శతకం పూర్తి చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో ఆఖరి ఓవర్లో ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6) ఔటయ్యాడు. భారత్‌ చివరి 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.

Story first published: Wednesday, May 29, 2019, 7:39 [IST]
Other articles published on May 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X