Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ గ్యారేజ్‌లో ఎన్ని కార్లున్నాయో తెలుసా!!

ICC Cricket World Cup 2019: Virat Kohli’s car collection: Take a look at his Audi A8 LW12, R8 LMX, R8, A8, Q7 and others

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి కార్లంటే చాలా ఇష్టం. ఇక ఆడీ కార్లంటే కోహ్లీకి పిచ్చి. ఈ మక్కువతో కోహ్లీ గ్యారేజ్‌ మొత్తం కార్లతో నిండిపోయింది. ప్రస్తుతం కోహ్లీ గ్యారేజ్‌లో పదికిపైగా కార్లున్నాయి. అందులో ఆరు కార్లు ఆడీ కంపెనీకి చెందినవే. ఆడీ కార్లలో సహా రెనాల్డ్‌ డస్టర్‌, లాండ్‌ రోవర్‌, రేంజ్‌ రోవర్‌, వోగ్‌, టొయోటా ఫార్చునర్‌ వంటి కార్లు ఉన్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

2015లో ఆడీ కార్ల అంబాసిడర్‌గా కోహ్లీ ఉన్నాడు. దీంతో కోహ్లీకి Q7 మోడల్‌ ఆడి కారును ఆ సంస్థ బహుమతిగా ఇచ్చింది. కోహ్లీ వద్ద ఉన్న ఆడీ R8 LMX మోడల్‌ కారు విలువ రూ.3 కోట్లు. కోహ్లీ వద్ద ఉండే అత్యంత ఖరీదైన కారు ఇదే. కోహ్లీకి ఈ కారంటే చాలా ఇష్టం. ఆడీ A8 LW12 మోడల్‌ కారు ధర రూ.2 కోట్లు. ఇక ఆడీ R8 V10 Plus, Q7 కార్ల విలువ దాదాపు ఒక కోటి రూపాయలు.

క్రికెటర్‌గా తొలిసారి కోహ్లీ గెలుచుకున్న రెనాల్డ్‌ డస్టర్‌ కారును గుర్తుగా తన గ్యారేజ్‌లో పెట్టుకున్నాడు. ఈ కారును కూడా కోహ్లీ వినియోగిస్తాడు. రేంజ్‌ రోవర్ కారు విలువ రూ.80లక్షలు, BMW X6 కారు ధర రూ. 1.2కోట్లు. సమయం దొరికినప్పుడల్లా కోహ్లీ వీటిలో చక్కర్లు కొడతాడు. ఇవికాక భార్య అనుష్క శర్మ వద్ద ఉన్న కార్లను కూడా కోహ్లీ ఉపయోగిస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ గడ్డపై ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, June 2, 2019, 16:50 [IST]
Other articles published on Jun 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+